Hyderabad: సైబర్ నేరగాళ్ల (Cyber Frauds) ఆగడాలు కొత్త పుంతలు తొక్కతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేర్వేరు మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన వరప్రసాద్ కంపెనీ ఈ-మెయిల్ ను హ్యాక్ చేశారు సైబర్ దొంగలు. మొత్తం రూ.46 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని సంతోష్ నగరానికి చెందిన వరప్రసాద్ సెన్సార్ కేర్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మెడికల్ పరికరాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి వాటిని కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు.
అమెరికా కంపెనీ మెయిల్ లాగా..
ఇందుకోసం అమెరికాలోని క్యాలిఫోర్నియా లో ఉన్న ఏజీ సైంటిఫిక్ అనే కంపెనీకి ఆర్డర్లు ఇస్తుంటాడు. ఇందుకోసం తన పర్సనల్ ఈ-మెయిల్ తో తరచూ లావాదేవీలు నిర్వహిస్తుంటాడు. తాజాగా ఆ కంపెనీకి చెందిన మెయిల్ ను హ్యాక్ చేశారు సైబర్ మాయగాళ్లు. అమెరికా కంపెనీ లాగా మెయిల్ చేసి కొత్త అకౌంట్ లోకి డబ్బులు వేయించుకున్నారు. ఇందులో భాగంగా 63 వేల డాలర్లను (ఇండియన్ కరెన్సీలో రూ. 46 లక్షలు) సైబర్ దొంగల ఖాతాల్లోకి డిపాజిట్ చేశాడు వరప్రసాద్. అయితే తాను లావాదేవీలు నిర్వహిస్తోన్న కంపెనీకి డబ్బులు అందలేదని తెలియడంతో తాను మోసపోయానన్న విషయం తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్ !! తీవ్ర ఉద్రిక్తత.. లైవ్ వీడియో
Akshay Kumar: కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్!.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..