Hyderabad BDS Student Suicide attempt: హైదరాహబాద్ జవహర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. BDS చదువుతున్న విద్యార్థిని సునంద అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆర్మీ డెంటల్ ఆఫ్ సైన్స్‌లో BDS నాలుగోవ సంవత్సరం చదువుతోన్న సునంద.. తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి యత్నించింది. ఇది గమనించిన తోటి విద్యార్థినులు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు.
2016- 17 బ్యాచ్‌కు చెందిన ఆమె BDS లో అడ్మిషన్ పొందారు. అయితే ఎంబీబీఎస్‌లో ప్రవేశం దొరకకపోవడంతో డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నట్టు సునంద తండ్రి చెప్తున్నారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే, అక్కడ లభించిన అధారాలతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ ఘటనకు రెండు రోజుల ముందు.. సునంద ఇంట్లో వాళ్లతో వీడియో కాల్ మాట్లాడారు. ఆ సమయంలో పెళ్లి ప్రస్తవన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆ కాల్ మాట్లాడిన మరుసటి రోజే ఆమె ఆత్మహత్యకు యత్నించడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ దిశగా కేసు విచారణ చేపట్టారు పోలీసులు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెల్సివుంది.
Read Also… Redmi 9c: రూ.9వేలలోపే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్.. 128జీబీ స్టోరేజీ.. అద్భుతమైన ఫీచర్స్