Husband killed his wife: దేశంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో సొంతవారినే కడతేరుస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా.. చిల్లి చికెన్ (Chilli Chicken) వండలేదని ఓ వ్యక్తి భార్యను దారుణంగా చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కూతురు జన్మదనం సందర్భంగా చికెన్ కూర వండలేదని.. భర్త భార్యను కిరాతకంగా నరికి చంపినట్లు చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దావణగెరె జిల్లా హరిహర ప్రాంతంలో జరిగింది. దావణగెరె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెంచప్ప, షీలా దంపతులు బన్నికోడు గ్రామంలో నివసిస్తున్నారు. 8 ఏళ్ల క్రితం ప్రేమంచి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అయితే.. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానంతో కెంచప్ప భర్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో కెంచప్పకు అంతకుముందే వివాహం జరిగిందని తెలియడం.. దీంతో అతని వేధింపులు ఎక్కువ అవ్వడంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. పలు మార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు.
అయితే.. ప్రస్తుతం పుట్టింటి దగ్గర ఉంటున్న షీలా.. బుధవారం రాత్రి కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన భర్త దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో తాగి ఉన్న కెంచప్ప చికెన్ కూర (చిల్లి చికెన్) వండాలని భార్యకు భర్త చెప్పాడు. అయితే.. వండలేదు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కెంచప్ప.. కోడవలితో భార్యను దారుణంగా నరికి చంపాడు. అనంతరం మత్తు దిగిన తర్వాత.. పోలీసుల దగ్గరకు వెళ్లి భార్యను చంపినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు కెంచప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..