Crime News: దారుణం.. చికెన్ వండేందుకు నో చెప్పిందని భార్య.. అంతలోనే విషాదం!

|

Nov 18, 2021 | 11:00 AM

కలకాలం తోడుంటామంటూ ఒక్కటైన జంటలు చిన్నపాటి గొడవలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. క్షణికావేశం దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి ఒక ఘటనే ఒకటి బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో వెలుగు చూసింది.

Crime News: దారుణం.. చికెన్ వండేందుకు నో చెప్పిందని భార్య.. అంతలోనే విషాదం!
Chicken
Follow us on

Wife Suicide after Refuses to Cook Chicken: కలకాలం తోడుంటామంటూ ఒక్కటైన జంటలు చిన్నపాటి గొడవలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. క్షణికావేశం దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి ఒక ఘటనే ఒకటి బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో వెలుగు చూసింది. కోడి కూర వండలేదన్న కోపంతో భార్య-భర్తల మధ్య గొడవ ప్రాణాల మీదకు తెచ్చింది. ఇరుగుపొరుగు సహాయంతో ఆస్పత్రిలో చేరిన కొత్త కోడలు చివరికి చికిత్సపొందుతూ.. తుదిశ్వాస విడిచింది. చంపారన్ జిల్లాలోని బేతియా నగరంలో నాగేంద్ర సింగ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. తన అల్లుడు తన కూతురిని హత్య చేయాలని ప్రయత్నించాడని, ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉందని నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణ చేయగా.. భార్యభర్తల జరిగిన చిన్నపాటి గొడవే ప్రాణాల మీదకు తెచ్చిందని తేల్చారు.

పోలీసుల కథనం ప్రకారం బేతియా నగరానికి చెందిన రాహుల్ కుమార్(26)కు పక్క గ్రామం పహాడ్‌పూర్‌లో నివసించే నాగేంద్ర సింగ్ కుమార్తె ఆర్తీ దేవి(19)తో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఆర్తీ దేవికి చిన్నప్పటి నుంచి మాంసాహారం తినడం ఇష్టం లేదు. ఆమె ఎక్కువగా శాఖాహారాన్నే తినేది. కానీ, రాహుల్ కుమార్‌కు చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. వీరిద్దరికీ వివాహమైన తరువాత ఆర్తీ దేవి మాంసాహారం వండడానికి భర్తతో తరుచు గొడవపడేది. తాను తినకపోయినా భర్త సంతోషం కోసం అప్పుడప్పుడూ చికెన్ వంటచేసేది. కానీ రాహుల్‌కు మాత్రం రోజూ మాంసాహారం కావాలి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఇదే క్రమంలో రాహుల్ కుమార్ నవంబర్ 15న ఇంటికి చికెన్ తెచ్చుకొని వచ్చి భార్యను వంట చేయమన్నాడు. ఆ రోజు ఏకాదశి కావడంతో ఆర్తీ మాంసాహారాన్ని ముట్టుకోనని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవకు దారి తీసింది. ఒకవైపు రాహుల్ ఎలాగైనా ఈ రోజు చికెన్ తినాల్సిందేనని పంతం పట్టుకొని కూర్చోగా.. మరోవైపు ఆర్తీ ఏకాదశి రోజు ఇంట్లో మాంసాహారం వండడానికి వీల్లేదని భీష్మించుకుంది. చివరికి రాహుల్ ఏం చేయాలో తోచక ఇంటి బయట వరండాలో చికెన్ వండడం మెదలు పెట్టాడు. ఇది గమనించిన అర్తీ.. భర్త రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని.. ఏకాదశి రోజు అలా చేయడం ఇంటికి అరిష్టమని భావించిన ఆర్తీ.. తీవ్ర మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అప్పటికే మంటలు అంటుకుని ఆమె తీవ్రంగా గాయపడింది. ఆర్తీ ఒంటిపై నిప్పుని ఆర్పి ఆమెను రాహుల్ ఆస్పత్రికి చేర్చాడు. ఈ క్రమంలో భర్త రాహుల్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు.

ఆస్పత్రిలో డాక్టర్లు ఆర్తీ శరీరం 90 శాతం కాలిపోయిందని.. కాపాడడం చాలా కష్టమని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా.. నవంబర్ 16న ఆర్తీ ప్రాణాలు వదిలింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల కారణంగా తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆర్తీ తండ్రి నాగేంద్ర సింగ్ కోరారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్తీ శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. మరోవైపు ఆర్తీ మరణం కేసుని పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. రాహుల్‌ని చంపేస్తామని ఆర్తీ కుటుంబ సభ్యులు బెదిరిస్తుండడంతో రాహుల్‌కు పోలీసుల రక్షణలో చికిత్స జరుగుతూ ఉంది.

Read Also…  Mimi Chakraborty: ఫొటోలు డిలీట్‌ అయ్యాయని ఎంపీ ట్వీట్‌.. భిన్న రకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..