Telangana: ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న మహిళతో నేను ఉండలేను.. పోలీసులను ఆశ్రయించిన తొమ్మిదో భర్త

|

Jun 22, 2022 | 4:28 PM

ఓ మహిళ.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుని, తొమ్మిదో భర్తతో కాపురం పెట్టింది. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి దాంపత్యంలో కలహాలు మొదలయ్యాయి. భార్య ఎందుకు అలా చేస్తుందో తెలియక భర్త అయోమయానికి గురయ్యాడు. ఎలాగైనా నిజాలు తెలుసుకోవాలని...

Telangana: ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న మహిళతో నేను ఉండలేను.. పోలీసులను ఆశ్రయించిన తొమ్మిదో భర్త
Marriage
Follow us on

ఓ మహిళ.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుని, తొమ్మిదో భర్తతో కాపురం పెట్టింది. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి దాంపత్యంలో కలహాలు మొదలయ్యాయి. భార్య ఎందుకు అలా చేస్తుందో తెలియక భర్త అయోమయానికి గురయ్యాడు. ఎలాగైనా నిజాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె గురించి తెలుసుకుని షాక్ అయ్యాడు. భార్యను ఆరా తీయగా.. ఆమె అదేమీ లేదని బుకాయిస్తూ రివర్స్ గా భర్తపైనే కేసు పెట్టింది. తెలంగాణలోని మహబూబాబాద్(Mahabubabad) కు చెందిన స్వప్నకు ఏపీలోని కృష్ణా జిల్లా గంపలగూడేనికి చెందిన వెంకటేశ్​తో పెళ్లయింది. వెంకటేశ్ బెంగుళూరులో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తుండటంతో బెంగుళూరులో కాపురం పెట్టారు. రెండు నెలలు బాగానే నడిచిన వీరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. స్వప్న తరచూ ఫోన్​లో ఎవరితోనో మాట్లాడుతుండటంతో వెంకటేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో స్వప్న.. హైదరాబాద్(Hyderabad) వెళ్లాలని వెంకటేశ్ ను అడిగింది. అసలు ఏం జరుగుతుందన్న విషయంపై ఆరా తీయగా వెంకటేశ్ కు సంచలన విషయాలు తెలిశాయి. స్వప్న తన కంటే ముందు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని, తనను తొమ్మిదో పెళ్లి చేసుకున్న మహిళతో తాను ఉండలేనని, విడాకులు కావాలని కోరాడు. దీనికి స్వప్న ఒప్పుకోలేదు. అంతే కాకుండా భర్త వెంకటేశ్ పై రివర్స్ కేసు పెట్టి పోలీసులకు కంప్లైంట్ చేసింది. తన భర్తే అనేక పెళ్లిళ్లు చేసుకున్నాడని ఫిర్యాదులో జత చేసింది. వీటి గురించి అడిగితే తనను కొట్టాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరనస చేపట్టింది.

విషయం తెలుసుకున్న వెంకటేశ్ సాక్ష్యాధారాలతో పోలీసుల వద్దకు చేరుకున్నాడు. ఆమె వివాహమాడిన ఎనిమిది మంది వివరాలను సేకరించి, పోలీసులకు ఇచ్చాడు. వారిలో కొంత మంది మరణించారని పోలీసులకు తెలిపాడు. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. అసలు సంగతేంటో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఎవర్ని మోసం చేశారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి