AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడో పెళ్లి కోసం.. రెండో భార్యను చంపి.. మొదటి భార్యను కూడా ఇలాగే

అప్పటికే అతనికి పెళ్లయింది. భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె సంతానం. కొన్నాళ్లు సజావుగా సాగిన వారి కాపురంలో మూడో పెళ్లి విషయం చిచ్చు రేపింది. మూడో పెళ్లి చేసుకోవాలనే..

మూడో పెళ్లి కోసం.. రెండో భార్యను చంపి.. మొదటి భార్యను కూడా ఇలాగే
Father Murder
Ganesh Mudavath
|

Updated on: Feb 28, 2022 | 8:08 PM

Share

అప్పటికే అతనికి పెళ్లయింది. భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె సంతానం. కొన్నాళ్లు సజావుగా సాగిన వారి కాపురంలో మూడో పెళ్లి విషయం చిచ్చు రేపింది. మూడో పెళ్లి చేసుకోవాలనే కాంక్షతో రెండో భార్యతో గొడవ పడ్డాడు. వివాహానికి ఆమె ఒప్పకోకపోవడంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం రెండో భార్యను హత్య(Murder) చేశాడు. అనంతరం మృతదేహాన్ని తమ పూర్వీకుల ఇంట్లో పడేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని కాస్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన జితేంద్ర.. తన రెండో భార్యను హత్య చేసి మరో అమ్మాయితో మూడో పెళ్లి చేసుకున్నాడు. రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న జితేంద్ర మూడో పెళ్లి కోసం తన రెండో భార్యను హత్య చేశాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ ఘటనకు పాల్పడిన తర్వాత జితేంద్ర తన కూతురిని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే మొదటి భార్యను కూడా ఇలాగే చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. జితేంద్ర రెండో పెళ్లి చేసుకునే సమయంలో.. తన మొదటి భార్య అనారోగ్య సమస్యలతో మరణించిందని చెప్పినట్లు తెలిసింది. మృతురాలిని జీతేంద్ర తరచూ కొట్టేవాడని, వేధింపులకు గురి చేసేవాడని ఆమె బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి జితేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

also Read

Amul Milk: అమూల్ పాల ధరలు మరింత ప్రియం.. ఎంత పెరగనున్నాయంటే..

మైనర్ పై లైంగిక వేధింపుల కేసు.. కోర్టు సంచలన తీర్పు.. శిక్ష పాటించాల్సిందేనని వ్యాఖ్య

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. నాపై బాధ్యత పెంచింది