Bihar Protests: బీహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. రెండు రైళ్లకు నిప్పు పెట్టిన ఆర్ఆర్‌బీ అభ్యర్థులు..!

|

Jan 27, 2022 | 6:42 AM

బీహార్‌లోని గయా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ.. రైళ్లకు నిప్పుపెట్టారు.

Bihar Protests: బీహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. రెండు రైళ్లకు నిప్పు పెట్టిన ఆర్ఆర్‌బీ అభ్యర్థులు..!
Train Fire
Follow us on

Train Set On Fire In Bihar: బీహార్‌లోని గయా(Gaya) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రైల్వే ఉద్యోగ నియామక(Railway Jobs) పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ.. రైళ్లకు నిప్పుపెట్టారు.

RRB పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆందోళన బాటపట్టారు అభ్యర్థులు. అది హింసాత్మకంగా మారింది. బీహార్‌లోని గయ రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్లకు నిప్పు పెట్టారు అభ్యర్థులు. ఒక గూడ్సు రైలు, ఒక ప్యాసింజర్‌ రైలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి పంపేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు పోలీసులు. దాదాపు 10 వేల మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారని చెబుతున్నారు అధికారులు. ఆగ్రహంతో ఉన్న విద్యార్థులను తప్పుదోవ పట్టించవద్దని కోరుతున్నారు గయా సీనియర్ ఎస్పీ ఆదిత్య కుమార్.

ఈ ఘటనపై రైల్వే శాఖ కమిటీని ఏర్పాటు చేసిందని, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. అయితే, అనర్హులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు విద్యార్థులు. ఇటీవల వెల్లడించిన పరీక్షా ఫలితాలు, రిక్రూట్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై చాలామంది అభ్యర్థులు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు అధికారులు. పాట్నా, భోజ్‌పూర్, నవాడా, సీతామర్హి, నలంద సహా బీహార్‌లోని పలు జిల్లాల్లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో కొందరు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో విద్యార్థులను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు పోలీసులు. నిరసనల్లో హింస చెలరేగడంతో రైల్వేశాఖ ఎన్‌టీపీసీ సహా మరికొన్ని టెస్ట్‌లను తాత్కాలికంగా నిలిపేసింది. అటు ఈ అవకతవకలపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read Also…. Omicron Variant: ఒమిక్రాన్‌ చర్మం, ప్లాస్టిక్‌పై ఎన్ని గంటలు జీవించి ఉంటుందో తెలుసా..? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు