డేటింగ్ సైట్లతో యువకులకు వల.. కీ’లేడి’ల హైటెక్ హానీ ట్రాప్!

యువకులే టార్గెట్‌గా విశాఖపట్నంలో నడుస్తున్న హానీ గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. డేటింగ్ సైట్ల ముసుగులో యువకులకు వల వేస్తున్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్‌ను వెనక నుంచి నడిపిస్తున్న కీలేడిలా కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ గుట్టు రట్టు కాగా.. పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించిన 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తి హానీ గ్యాంగ్ వలలో చిక్కుకుని 17 లక్షలు పోగొట్టుకున్నాడని […]

  • Ravi Kiran
  • Publish Date - 7:00 pm, Sat, 26 October 19
డేటింగ్ సైట్లతో యువకులకు వల.. కీ'లేడి'ల హైటెక్ హానీ ట్రాప్!

యువకులే టార్గెట్‌గా విశాఖపట్నంలో నడుస్తున్న హానీ గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. డేటింగ్ సైట్ల ముసుగులో యువకులకు వల వేస్తున్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్‌ను వెనక నుంచి నడిపిస్తున్న కీలేడిలా కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ గుట్టు రట్టు కాగా.. పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించిన 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తి హానీ గ్యాంగ్ వలలో చిక్కుకుని 17 లక్షలు పోగొట్టుకున్నాడని సమాచారం. పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఈ ముఠా పని చేస్తున్నట్లు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పోలీసు ఉన్నతాధికారి గోపీనాథ్ నేతృత్వంలో ఏర్పాటైన ఓ పోలీసు బృందం కోల్ కతా వెళ్లి స్థానిక పోలీసులు సహాయంతో హనీ ట్రాప్ గ్యాంగ్ కు సంబంధించిన కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, పోలీసులు పీటీ వారంట్‌పై వారిని విశాఖకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

యువకులను లక్ష్యంగా చేసుకుని యువతుల ఫోటోలను మార్పింగ్ చేసి వెబ్‌సైట్లలో పెట్టి వల వేస్తున్నారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. గ్యాంగ్‌కు సంబంధించిన మూడు ల్యాప్ టాప్‌లు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ళ నుంచి ఈ గ్యాంగ్ కార్యకలాపాలపై కూపీ లాగుతున్న పోలీసులు చివరికి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు.