High alert: ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో హై అలర్ట్.. నిఘా పెంచిన ప్రత్యేక పోలీస్ బలగాలు

ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దుల్లో పోలీస్ బలగాల నిఘా పెంచారు. జులై 1న ఏజెన్సీలో బందుకు పిలుపునివ్వడంతో పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల కొయ్యూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు,

High alert: ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దుల్లో హై అలర్ట్.. నిఘా పెంచిన ప్రత్యేక పోలీస్ బలగాలు

Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2021 | 4:47 PM

ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో పోలీస్ బలగాల నిఘా పెంచారు. జులై 1న ఏజెన్సీలో బందుకు పిలుపునివ్వడంతో పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల కొయ్యూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా మావోయిస్టులు జూలై 1న ఏవోబీ బంద్‌కు పిలుపు ఇచ్చారు.

సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలతో సరిహద్దు ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. సీలేరు, డొంకరాయి, జీకే వీధి, చింతపల్లి ప్రాంతాల మీదుగా వస్తున్న వాహన రాకపోకలను బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్‌లతో తనిఖీలు చేస్తున్నారు.  ఏజెన్సీ అంతటా ముమ్మరంగా తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.

మావోయిస్టుల కదలికల ఆధునిక టెక్నాలజీతో నిఘా పెట్టారు. బంద్‌ నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. హిట్‌లిస్టులో ఉన్న నేతలకు నోటీసులు అందించారు. బంద్‌ను భగ్నం చేసేందుకు అడవుల్లో కూంబింగ్‌కు బలగాలు చేరుకున్నాయి. కాగా.. ఈ బంద్‌ ఏవోబీకి మాత్రమే పరిమితమని ఓఎస్డీ సతీష్‌కుమార్‌ చెప్పారు.  కాగా, విశాఖ ఏజెన్సీలో సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ రష్మీ శుక్లా, ఆ శాఖ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. జవాన్‌లంతా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి : Supreme Court: అల్లోపతిపై మీరు చేసిన అసలు రికార్డులు సమర్పించండి.. బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు