Hyderabad: వివాహితను ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డాడు..మాట వినలేదని ఆఖరుకు ఇలా..

|

May 27, 2022 | 9:12 PM

ప్రేమించానని...తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఆరుగురు సంతానం ఉన్న ఓ వితంతువు ను వేధించడం మొదలు పెట్టాడు.... అతని వేధింపులు భరించలేక ఆమె కంచన్​బాగ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Hyderabad: వివాహితను ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డాడు..మాట వినలేదని ఆఖరుకు ఇలా..
representative image
Follow us on

ప్రేమించానని…తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఆరుగురు సంతానం ఉన్న ఓ వితంతువు ను వేధించడం మొదలు పెట్టాడు…. అతని వేధింపులు భరించలేక ఆమె కంచన్​బాగ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు.. శుక్రవారం మధ్యాహ్నం పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి తిరిగి ఇంటికి నడుచుకుంటే వెళ్తున్న సదరు మహిళపై పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో విచక్షణ రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కంచన్​బాగ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. కంచన్​బాగ్​ ఇన్​స్పెక్టర్​ ఉమామహేశ్వర్​ రావు తెలిపిన వివరాల ప్రకారం ..

హఫీజ్​బాబానగర్​ కు చెందిన నూర్​ భాను (45) భర్త ఇంతియాస్​ దంపతులు. వీరికి ఆరుగురు సంతానం. నలుగురు కూతుళ్ళు, ఇద్దరు కుమారులు సంతానం. భర్త ఇంతియాస్​ కేబుల్​ ఆపరేటర్​. ముగ్గురు కూతుళ్ల వివాహం జరిగింది. రెండేళ్ళ క్రితం అనారోగ్య కారణంగా మృతిచెందాడు. భర్త చనిపోయాక భార్య నూర్​ భాను కేబుల్​ ఆపరేటర్​ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ నేపధ్యంలో అదే ప్రాంతానికి చెందిన హబీబ్​ పరిచమయ్యాడు. నిన్ను ప్రేమిస్తున్నానని నూర్​భాను వెంటపడడం మొదలు పెట్టాడు. నన్ను పెళ్ళి చేసుకోవాల్సిందేనంటూ ఇంతియాస్​ బెదిరించసాగాడు. దీంతో నూర్​భాను ఇంతియాస్​పై కంచన్​బాగ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో ఇంతియాస్​ను అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించారు. బెయిల్​పై బయటికి వచ్చిన ఇంతియాస్​ నూర్​భానును మళ్ళీ వేధించడం మొదలు పెట్టాడు. ఇంట్లోకి చొరబడానికి వచ్చిన ఇంతియాస్​పై నూర్​భాను మరిది సయ్యద్​ ఇజాతో పాటు పలువురు అడ్డుకున్నారు. దీంతో ఇంతియాస్​ కంచన్​బాగ్​ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ​ నూర్​భాను మరిది సయ్యద్​ ఇజాజ్ తో పాటు మరికొంత మందిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. దీంతో నూర్​భాను, ఇంతియాస్​లమధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా శుక్రవారం ఉదయం నూర్​భాను చంచల్​గూడలో ఉండే పెద్దకూతురు ఇంటికి వెళ్ళింది. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో మధ్యాహ్నం 1గంటల ప్రాంతంలో ఉమర్​ హోటల్​ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే కాపు కాసి ఉన్న హబీబ్​ కత్తితో వెంటపడ్డాడు. పట్టపగలు నడి రోడ్డులో భయంతో పరుగులు తీస్తున్న నూర్​భానును వెనుక నుంచి హబీబ్​ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె వీపు, ముఖం, మెడ, చేతికి, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 12 సెకండ్ల పాటు కత్తితో దాడిచేసిన సి.సి కెమెరాలో నిక్షిప్తమయ్యింది. దాడిచేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అడ్డుకోవడానికి ముందుకు కదలడంతో కత్తితో బెదిరించి హబీబ్​ ఆక్టివాను అక్కడే వదిలి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన నూర్​భాను ను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆమెకు ప్రాణప్రాయం తప్పిందని, పరారీలో ఉన్న హబీబ్​కోసం 5 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. దాడికి పాల్పడ్డ హబీబ్​ ఆక్టివా వాహనంపై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆక్టివాను అక్కడే వదిలేసి పరారుకావడంతో ఆక్టివా వాహనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును కంచన్​బాగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

రిపోర్టర్:  నూర్ మహమ్మద్, హైదరాబాద్