Govt. Teacher fell into a Pond and Died: సంగారెడ్డి జిల్లాలో విషాదంలో చోటుచేసుకుంది. వాకింగ్ చేసుకుంటూ వెళ్లిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు వద్ద జరిగింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బద్రిగూడెం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో నర్సింలు(45) ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సంగారెడ్డి శాంతినగర్ లో నివాసం ఉంటున్న నర్సింలు రోజు ఉదయం చెరువు కట్టపై వాకింగ్ కోసం వెళ్లే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఎంతసేపటికీ నర్సింలు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు వెతుకుతుండగా, మహబూబ్ సాగర్ చెరువులో శవమై తేలాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసలు నర్సింలు మృతదేహన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, నర్సింలు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కొడుకు, భార్య ఉన్నారు.
Read Also…. Siddipet: 3 రోజుల క్రితం పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన వృద్దుడు.. అరుపులు వినపడడంతో