AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet: 3 రోజుల క్రితం పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన వృద్దుడు.. అరుపులు వినపడడంతో

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గుండవెల్లి గ్రామ శివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో గత మూడు రోజుల క్రితం...

Siddipet: 3 రోజుల క్రితం పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన వృద్దుడు.. అరుపులు వినపడడంతో
Old Man Fell Into Well
Ram Naramaneni
|

Updated on: Jul 02, 2021 | 3:11 PM

Share

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గుండవెల్లి గ్రామ శివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో గత మూడు రోజుల క్రితం సిద్దిపేట పట్టణం బారా ఇమామ్ కాలనీకి చెందిన పైసా లచ్చయ్య ప్రమాదవశాత్తూ పడిపోయాడు. కూలి పనుల చేస్తూ జీవనం సాగించే  లచ్చయ్య వయసు 80 సంవత్సరాలు. పనుల కోసం వెళ్తుండగా అదుపుతప్పి కాలుజారి బావిలో పడిపోయాడు. శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలం బావిలో నుండి అరుపులు వినపడటంతో పొరుగు రైతు వెళ్లి చూడగా లచ్చయ్య కనిపించాడు.  వెంటనే సిద్దిపేట రూరల్ పోలీసులకు ఫోన్ చేయగా… రూరల్ ఎస్ఐ శంకర్, కానిస్టేబుల్ నర్సింహులు,హోంగార్డ్స్ సయ్యద్, మల్లేశం, ఫైర్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో వ్యవసాయ బావిలోకి దిగి తాళ్ళు కట్టి అతనిని సురక్షితంగా పైకి లాగి రక్షించారు. వెంటనే 108 అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని వారి బంధువులకు తెలపగా వారు ఆస్పత్రికి వచ్చి.. మూడు రోజుల నుంచి లచ్చయ్య కనబడటం లేదని.. పలు చోట్ల వెతుకుతున్నామని తెలిపారు. బావిలో పడిన తన తండ్రిని సురక్షితంగా బయటకు తీసి రక్షించినందుకు సిద్దిపేట రూరల్ పోలీసులకు, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి పైసా లచ్చయ్య కుమారుడు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా బావిలో నీరు లేకపోవడంతో లచ్చయ్య గాయాలతో బయటపడ్డాడు. నీరు, ఆహారం లేకపోయినప్పటికీ వృద్దుడు విధిని ఓడించి గెలిచాడు.

Also Read: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు.. గత జీవోలకు అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్మాణంః మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌పై అసహనం వ్యక్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. స్పందించిన యాజమాన్యం.

Follow Us
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున