తమిళనాడు రాష్ట్రంలోని ప్రాచీన గుడిలో బయటపడిన గుప్తనిధులు.. వాటి విలువ ఎంతుంటుందో తెలుసా?

|

Dec 13, 2020 | 12:39 PM

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. జిల్లాలోని ఉత్తరమేరుర్‌లో ఉన్న

తమిళనాడు రాష్ట్రంలోని ప్రాచీన గుడిలో బయటపడిన గుప్తనిధులు.. వాటి విలువ ఎంతుంటుందో తెలుసా?
Follow us on

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. జిల్లాలోని ఉత్తరమేరుర్‌లో ఉన్న కుళంబేశ్వరాలయం తవ్వకాలు జరుపుతుండగా బంగారు నాణేలు,నగలు కనిపించాయి. స్థానికులు అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని వాటిని పరిశీలిస్తున్నారు. బయటపడ్డ బంగారం సుమారుగా రెండు కిలోల పైన ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
అయితే ఈ ఆలయం పల్లవుల కాలంనాటిదని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ నిధులు కూడా వారి కాలంలోనివే అని స్పష్టం అవుతున్నాయి.

అయితే ఈ నిధులపై ఇప్పుడు ఆలయ ట్రస్ట్ బోర్డు, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. దేవాదాయ శాఖలో ఈ ఆలయం లేదని ట్రస్ట్ సభ్యులు అంటున్నారు. బయటపడ్డ ఈ గుప్తనిధులు ఆలయానికే చెందాలని పట్టుబడుతున్నారు. పురాతన ఆలయం కనుక అలాచేయడం కుదరదని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. గుప్తనిధులు బయటపడుతుండటంతో ఆలయంలో ఇంకా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే ఆలయంలో ఇవి ఎవరు దాచరనే దానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కనుక ఇవి ఎవరి కాలం నాటియో స్పష్టత కోసం పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు.