
Latest Crime: పెళ్లి చేసుకోమని ఏడాది కాలంగా అడుగుతున్నా నిరాకరించినందుకు విసిగిపోయిన ఓ యువతి ప్రియుడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం- కాపవరం గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. ఈ క్రమంలో తాతాజీ ద్విచక్ర వాహనంపై పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి పావని అతని వద్దకు వెళ్లింది. రాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఆమెను దింపడానికి మలకపల్లి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చుని ఉన్న పావని బ్యాగులోని కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. దీంతో కింద పడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపై పొడిచింది. తీవ్ర గాయాలతో తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ దారిలో వెళుతున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్య.. అతడి రూమ్‌లోనే తాడుతో ఉరేసుకొని..