Andhra Pradesh: ఒకే సారి రెండు పాములు ఎటాక్.. కాళ్లు, చేతులపై కాట్లు.. ఆఖరుకు

పాములు పగబడతాయా.. ఇదేం ప్రశ్న అంటారా. నిజం పాములు పగబడతాయి. దీన్ని నిరూపించే ఘటనలు గతంలో కొన్ని జరిగాయి. ఇవి శాస్త్రీయంగా రుజువు కానప్పటికీ కొట్టిపారేయలేం. సాధారణంగా పాములకు ఏమైనా హాని కలిగిస్తే అవి పగబడతాయని అంటూ....

Andhra Pradesh: ఒకే సారి రెండు పాములు ఎటాక్.. కాళ్లు, చేతులపై కాట్లు.. ఆఖరుకు
Snake Bite Death

Updated on: Jul 16, 2022 | 8:12 PM

పాములు పగబడతాయా.. ఇదేం ప్రశ్న అంటారా. నిజం పాములు పగబడతాయి. దీన్ని నిరూపించే ఘటనలు గతంలో కొన్ని జరిగాయి. ఇవి శాస్త్రీయంగా రుజువు కానప్పటికీ కొట్టిపారేయలేం. సాధారణంగా పాములకు ఏమైనా హాని కలిగిస్తే అవి పగబడతాయని అంటూ ఉంటారు. అయితే ఒకే వ్యక్తిని రెండు పాముులు కాటేస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి నిద్రిస్తున్న బాలికను రెండు పాములు కాటేశాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కర్నూలు జిల్లా నందవరం మండలంలోని యానం గ్రామానికి చెందిన నాగరాజు, నరసమ్మ దంపతుల మూడో కుమార్తె మల్లేశ్వరి. ఆమె మంత్రాలయంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి నిద్రకు ఉపక్రమించింది. నిద్రలో ఉన్న సమయంలో ఆమెకు ఏదో కరిచినట్లు మంటగా అనిపించింది.

ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. ఆయన వెంటనే అప్రమత్తమై లైట్ వేసి చూశాడు. మల్లేశ్వరి చేతి వద్ద ఓ పాము, కాలు వద్ద మరో పాము కనిపించాయి. వెంటనే వాటిని చంపేశాడు. అనంతరం చికిత్స నిమిత్తం కుమార్తెను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. బాగా చదివి, జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటుందనుకుంటున్న కుమార్తె హఠాత్తుగా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి