AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ప్రేమించాలంటూ యువకుడి వేధింపులు.. పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం..

Khammam Crime News: ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యువకుడి వేధింపులతో.. ఈ నెల 9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన

Crime News: ప్రేమించాలంటూ యువకుడి వేధింపులు.. పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం..
Suicide
Shaik Madar Saheb
|

Updated on: Sep 11, 2021 | 1:35 PM

Share

Khammam Crime News: ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యువకుడి వేధింపులతో.. ఈ నెల 9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలిక(15) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. గత కొంత కాలంగా తనను ప్రేమించాలని యువకుడు సాయి ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 9న నిందితుడు బాలికపై ఒత్తిడి చేశాడు. దీంతో విద్యార్థిని వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది.

దీంతో స్థానికులు చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని వెంటనే బాలికను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్న బాలిక నిన్న రాత్రి.. పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడు సాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కాగా.. బాలిక మృతి అనంతరం.. ఆమె బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని.. తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

Also Read:

Crime news: సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..

Crime News: చెల్లిని దారుణంగా చంపిన అన్న.. వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని.. తుపాకీతో..

Delhi Airport: ఆ విమానాన్ని పేల్చేస్తాం.. ఢిల్లీ విమానాశ్రయానికి బెదిరింపులు.. అలెర్ట్..

Follow Us
నిద్ర దిశ కూడా మీ అదృష్టాన్ని మార్చగలదు.. వాస్తు ప్రకారం సరైన దిశ
నిద్ర దిశ కూడా మీ అదృష్టాన్ని మార్చగలదు.. వాస్తు ప్రకారం సరైన దిశ
ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి
ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి
తిరుపతికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. ఆ తర్వాత సీన్ చూడండి
తిరుపతికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. ఆ తర్వాత సీన్ చూడండి
రాములోరి కల్యాణానికి భారీ ఏర్పాట్లు.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి
రాములోరి కల్యాణానికి భారీ ఏర్పాట్లు.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి
చేపల కూరను తలదన్నే నేల ములక్కాయ కూర..
చేపల కూరను తలదన్నే నేల ములక్కాయ కూర..
ఏంటీ ఈ అమ్మడు హీరో అబ్బాస్ కూతురా.!
ఏంటీ ఈ అమ్మడు హీరో అబ్బాస్ కూతురా.!
ఛీ కొట్టారు, అవమానించారు.. కట్‌చేస్తే.. ఆ అవార్డ్‌తో ఇచ్చిపడేశాడు
ఛీ కొట్టారు, అవమానించారు.. కట్‌చేస్తే.. ఆ అవార్డ్‌తో ఇచ్చిపడేశాడు
బాతును కోస్తుండగా.. దాని కడుపులో ఉన్నది చూసి పట్టరాని సంతోషం..
బాతును కోస్తుండగా.. దాని కడుపులో ఉన్నది చూసి పట్టరాని సంతోషం..
బంగారం, వెండి ధరలు ఢమాల్‌.. భారీగా తగ్గిన రేట్లు..!
బంగారం, వెండి ధరలు ఢమాల్‌.. భారీగా తగ్గిన రేట్లు..!
రూ.1కే బూట్లు ఆఫర్.. కొనేందుకు షాపు ముందు ఎగబడ్డ జనాలు! ఎక్కడంటే
రూ.1కే బూట్లు ఆఫర్.. కొనేందుకు షాపు ముందు ఎగబడ్డ జనాలు! ఎక్కడంటే