Ongole Crime News: అంతా క‌ల్తీ మ‌యం.. నెయ్యిని వీరు ఎలా త‌యారు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు

|

Jun 12, 2021 | 5:43 PM

ఈజీ మనీ కోసం ఆశపడ్డవారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇంటినే ఓ కుటీర పరిశ్రమలా మార్చుకొని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కేటుగాడి...

Ongole Crime News: అంతా క‌ల్తీ మ‌యం.. నెయ్యిని వీరు ఎలా త‌యారు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు
Adulterated Ghee
Follow us on

ఈజీ మనీ కోసం ఆశపడ్డవారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇంటినే ఓ కుటీర పరిశ్రమలా మార్చుకొని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కేటుగాడి ఆట కట్టించారు ఒంగోలు పోలీసులు. ఒంగోలులో నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు.  నాగేంద్రనగర్‌లోని ఓ ఇంట్లో పామాయిల్‌, త‌క్కువ ధరకు లభించే వంటనూనెలు వంటి వాటితో  నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నారు. ఈ మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెయ్యిలీటర్ల నాసిరకం నెయ్యి గుర్తించారు. మార్కెట్‌ నుంచి నాసిరకం నెయ్యిని సేకరించి ఆ నెయ్యిలో పామాయిల్‌ కలిపి కల్తీ చేస్తున్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాసిరకం నెయ్యిలో పామాయిల్‌ మిక్స్ చేసి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నాడు. ఇందులో తప్పేమీ లేందంటున్నాడీ నిందితుడు. మిల్క్‌ డెయిరీ నిర్వాహకులు చేసే పనే తానూ చేస్తున్నానని బుకాయిస్తున్నాడు.

కల్తీ నెయ్యిని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో శివగాయత్రి మిల్క్‌డైరీ పేరుతో విక్రయిస్తున్నాడీ కేటుగాడు. ఇప్పటికే 72 లక్షల రూపాయల కల్తీనెయ్యి అమ్మకాలు జరిపినట్టు విచారణలో తేలింది. ఏఏ ప్రాంతాలకు సరఫరా చేశారో గుర్తించి వాటిని వెనక్కి రప్పిస్తామన్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని గుర్తించిన స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులను ఎస్‌పి సిద్ధార్థ కౌశల్ అభినందించారు.

Also Read: ‘క‌రోనా మాతా.. కాపాడ‌మ్మా, శాంతించ‌మ్మా’.. మ‌హమ్మారికి గుడిక‌ట్టి పూజ‌లు చేస్తున్న గ్రామ‌స్తులు

ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి