నువ్వు మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నావ్.. వెంటనే నీ భర్తకు విడాకులిచ్చేయ్!

|

Feb 04, 2022 | 2:14 PM

స్వలింగ సంపర్కుడైన భర్త (gay husband)తో విసిగిన ఓ భార్య మూడోసారి కోర్టును ఆశ్రయించింది. అప్పటికే భర్త చేష్టల కారణంగా విడివిడిగా జీవిస్తోంది. వీరిద్దరి కేసులో..

నువ్వు మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నావ్.. వెంటనే నీ భర్తకు విడాకులిచ్చేయ్!
Gay Husband
Follow us on

స్వలింగ సంపర్కుడైన భర్త (gay husband)తో విసిగిన ఓ భార్య మూడోసారి కోర్టును ఆశ్రయించింది. అప్పటికే భర్త చేష్టల కారణంగా విడివిడిగా జీవిస్తోంది. వీరిద్దరి కేసులో భార్యకు కొంత భరణం అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కూడా. ఐతే సదరు భర్త, తన భార్యకు భరణం ఇవ్వకపోగా, నిత్యం వేధింపులకు దిగడంతో.. విసిగిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడికి కోర్టు రికవరీ వారెంట్ జారీ చేసింది.

వివరాల్లోకెళ్తే.. ఇండోర్‌ (Indore)కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ (fashion designer) దీపక్‌తో బాధితురాలికి 2015, జూన్‌లో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్త, అతని సోదరుడు, అత్త కట్నం కోసం నిత్యం హింసించడం ప్రారంభించారు. వారి డిమాండ్లు అంగీకరించకపోతే చంపేస్తామని బెదిరించేవారు. దీంతో బాధితురాలు భర్తపై కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసులో బాధితురాలికి ప్రతి నెలా భర్త నుంచి కొంత భరణం అందించేలా ఫిబ్రవరి, 2020లో కోర్టు ఆదేశించింది. అయినా దీపక్ ప్రవర్తనలో మార్పురాకపోగా అతని స్నేహితుడితో కలిసి భార్యను వేధించడం ప్రారంభించాడు. ప్రతి నెలా తనకు అందించవల్సిన భరణం కూడా మానేశాడు. స్నేహితుడితో కలిసి జల్సాలు చేసేవాడు. అంతటితో ఊరుకోకుండా సోషల్ మీడియాలో అసభ్యకర చిత్రాలను అప్‌లోడ్ చేసేవాడు. వాటికి భార్య పేరును ట్యాగ్ చేసే వాడు. తెలిసిన వారి ఎదుట తనను కించపరుస్తూ మాట్లాడేవాడని బాధితురాలు ఆరోపించింది.

భర్త తన స్నేహితుడితో కలిసి స్వలింగ సంపర్కుల చిత్రాలను పంపుతున్నాడని తెల్పింది. అంతేకాకుండా ’నువ్వు మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నావని, వెంటనే విడాకులు తీసుకోమని దీపక్, అతని స్నేహితుడు బాధితురాలిని బెదిరించారని లాసుడియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో దీపక్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై నిందితుడికి కోర్టు రికవరీ వారెంట్ జారీచేసినట్లు పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Also Read:

Hyderabad Jobs 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు అలర్ట్!రూ.1,75,000ల జీతంతో  హైదరాబాద్‌లో 33 ఉద్యోగాలు.. 6 రోజులే..