Telangana: మత్తుకు‌ చిత్తవుతున్న మైనర్స్.. విచ్చల విడిగా గంజాయి అమ్మకం.. ఎక్కడంటే..

పట్టుమని‌ 15 ఏండ్లు నిండని చిన్నారులని గంజాయి, డ్రగ్స్‎లకి అలావాటు చేస్తున్నారు దుర్గార్ములు. పేద, మధ్య తరగతి కుటుంబాల అవసరాలని ఆసరాగా చేసుకొని మొదట డ్రగ్స్, గంజాయిలకి‌ అలవాటు చేసి తరువాత వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్త జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. మత్తుకు బానిస అయిన తమ‌ కూతురు‎పై‌ అత్యాచారం జరిగిందని ఓ బాధిత కుటుంబం ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Telangana: మత్తుకు‌ చిత్తవుతున్న మైనర్స్.. విచ్చల విడిగా గంజాయి అమ్మకం.. ఎక్కడంటే..
Drugs In Jagtial

Edited By: Srikar T

Updated on: Mar 24, 2024 | 9:59 AM

పట్టుమని‌ 15 ఏండ్లు నిండని చిన్నారులని గంజాయి, డ్రగ్స్‎లకి అలావాటు చేస్తున్నారు దుర్గార్ములు. పేద, మధ్య తరగతి కుటుంబాల అవసరాలని ఆసరాగా చేసుకొని మొదట డ్రగ్స్, గంజాయిలకి‌ అలవాటు చేసి తరువాత వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్త జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. మత్తుకు బానిస అయిన తమ‌ కూతురు‎పై‌ అత్యాచారం జరిగిందని ఓ బాధిత కుటుంబం ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ బాలిక గంజాయి మత్తుకు అలావాటు పడింది. తనతో పాటుగా చదువుకుంటున్న బాలుడుపై గంజాయి కోసం‌ అధారపడేది. మరికొద్ది రోజులకి అ బాలుడు‌ గంజాయి ఇవ్వకపోవడంతో వేరే యువకుడిని ఆశ్రయించింది. అతడు‌ చెప్పినట్లు‌‌ చేస్తే గంజాయి, డ్రగ్స్ కోసం డబ్బులు‌ ఇచ్చేవాడని బాలిక స్వదార్ హోం, మానసిక నిపుణులకు తెలిపింది. చిన్నారి లాగే మరో‌ కొంతమంది డ్రగ్స్ మత్తుకు‌ అలవాటు పడినట్లు‌ తెలుస్తుంది.

బాలికపై డ్రగ్స్ ప్రయోగించి అత్యాచారం‌ చేశారని బాలిక తండ్రి గతంలో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. గంజాయి‌ రాకెట్‎పై పోలీసులు కొంతమంది యువకులని‌ అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసారు. కూలీ చేసుకొని జీవించే నిరుపేద కుటుంబాలకి చెందిన బాలికలని డ్రగ్స్ అలవాటు చేయడంతో పిల్లల ప్రవర్తనలో మార్పులు రావడం అలస్యంగా‌ గుర్తించారు‌ తల్లిదండ్రులు దీంతో ఈ విషయం చాలా రోజుల పాటు వెలుగులోకి రాలేదు. అమ్మాయి కరీంనగర్ లోని‌ స్వదార్ హోం లో చికిత్స పొందుతుంది. నెలరోజులు అవుతున్నా ఇంకా అ బాలిక పుర్తిగా కోలుకోలేదు. మొదట్లో చికిత్సకి కూడా సహాకరించలేదని.. ఇప్పుడిప్పుడే చికిత్స అందిస్తున్నామని‌ అంటున్నారు. పోలీసులు, నార్కోటిక్ విభాగం వారు ఈ కేసుపై‌ దర్యాప్తు చేస్తున్నారు. స్టుడెంట్స్ బతుకులని ఆగం చేసిన ముఠా వెనుక ఎవరు ఉన్నారని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. మైనర్లు డ్రగ్స్‎కు అలవాటు పడుతున్నారని తమ దగ్గరికి వచ్చిన మైనర్స్ కౌన్సిలింగ్ ఇచ్చి వారిని చదివించే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..