Latest Crime: మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో దారుణం.. బొప్పాయి తిన్నందుకు గోమాతకు ఇంతటి శిక్షా..

|

Feb 19, 2021 | 2:32 PM

Latest Crime: మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పండ్ల బండి నుంచి ఓ ఆవు బొప్పాయి తిన్నందుకు ఆ వ్యాపారి చాలా కఠినంగా

Latest Crime: మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో దారుణం.. బొప్పాయి తిన్నందుకు గోమాతకు ఇంతటి శిక్షా..
Follow us on

Latest Crime: మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పండ్ల బండి నుంచి ఓ ఆవు బొప్పాయి తిన్నందుకు ఆ వ్యాపారి చాలా కఠినంగా ప్రవర్తించాడు. కత్తితో ఆవు కడుపులో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రాయ్‌గడ్ జిల్లాలోని మురుద్ వద్ద తౌఫిక్ బషీర్ ముజావర్ అనే వ్యక్తికి పండ్ల షాపు ఉంది. అయితే ఆ షాపు ముందటి పండ్ల బండి నుంచి ఓ ఆవు బొప్పాయి పండును తిన్నది. దీంతో ఆగ్రహించిన తౌఫిక్ బషీర్ ముజావర్ కత్తితో ఆవు కడుపులో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు.

ఇది గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆవును వెటర్నరీ ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా జంతు నిరోధక చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై హిందువాదులు, బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Elephants Attack Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ దంతరి జిల్లాలో దారుణ ఘటన.. యువకుడిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు..