SI Murder: మేకల కోసం ఎస్సై మర్డర్.. పోలీసుల అదుపులో నిందితులు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు..

|

Nov 22, 2021 | 12:32 PM

స్పెషల్‌ ఎస్‌ఐను దారుణంగా హత్య చేసిన ఘటనను వేగంగా ఛేదించారు పోలీసులు. నలుగురు హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో..

SI Murder: మేకల కోసం ఎస్సై మర్డర్.. పోలీసుల అదుపులో నిందితులు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు..
Si Bhuminathan
Follow us on

స్పెషల్‌ ఎస్‌ఐను దారుణంగా హత్య చేసిన ఘటనను వేగంగా ఛేదించారు పోలీసులు. నలుగురు హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు.  వారి వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమను పట్టుకునేందుకు వచ్చిన స్పెషల్‌ ఎస్‌ఐను దారుణంగా హతమార్చారు మేకల దొంగలు. మేకల దొంగలు వేట కొడవలితో ఎస్ఐను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుచ్చి జిల్లా నవల్‌పట్టుకు చెందిన స్పెషల్ ఎస్సై భూమినాథన్‌ (55) శనివారం రాత్రి పుదుక్కోట్టై జిల్లా కీరనూర్‌ సమీపంలోని కలమావూర్‌ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున బైకుపై మేకతో వెళుతున్న ఇద్దరిని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారవ్వడంతో.. భూమినాథన్‌, మరో పోలీస్‌ చిత్తిరైవేల్‌ వేర్వేరుగా ద్వచక్రవాహనాలపై వారిని వెంబడించారు. ఈ క్రమంలో మేకల దొంగలు కీరనూర్‌ ప్రాంతంలో భూమినాథన్‌ను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చే లోపే దొంగలు భూమినాథన్‌ను కొడవలితో నరికి కిరాతకంగా హత్య చేసి పారిపోయారు. కీరనూర్‌ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుచ్చిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం దుండగులను పట్టుకునేందుకు ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్..

కాగా.. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. భూమినాథన్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. భూమినాథన్ నవల్‌ పట్టు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీ పరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎస్ఐ మృతిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల హత్యలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా.. ఎస్ఐ అంత్యక్రియలు తిరుచ్చి సోలమానగర్‌లోని ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

ఇవి కూడా చదవండి: Fashion Tips : ఈ 3 రకాల బట్టలు కొంటున్నారా..అయితే మీరు డబ్బు వెస్ట్ చేసుకుంటున్నట్లే.. అవేంటో మీకు తెలుసా..

Republic Day 2022: రిపబ్లిక్ డే వేడుకలకు బిమ్స్‌టెక్ నాయకులు.. పాక్, చైనా కుట్రలను తిప్పికొట్టేందుకే అంటున్న విశ్లేషకులు..