Attack On Police: హైదరాబాద్ నగర శివారు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. విచారణలో భాగంగా నోవాపాన్ చౌరస్తాలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన బాచుపల్లి స్టేషన్ కానిస్టేబుల్ కనకయ్యపై నలుగురు వ్యక్తులు దాడికి దిగారు.
వివరాల్లోకి వెళితే.. మారుతీ ప్రసాద్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్న ప్రసాద్ ఇంటీరియర్ డిజైన్ చేయించడం కోసం రూ. 5 లక్షలకు దేవీలాల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తొలుత కొంత మొత్తాన్ని ప్రసాద్ అడ్వాన్స్‌గా దేవీలాల్‌కు అందించాడు. ఇక డబ్బులు తీసుకున్నదేవీలాల్ పని ప్రారంభించకుండా తప్పించుకు తిరిగాడు. దీంతో ప్రసాద్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంత వెతికినా దేవీలాల్ ఆచూకి దొరకలేదు దీంతో ప్రసాద్ నేరుగా కానిస్టేబుల్ కనకయ్యను దేవీలాల్ దగ్గరకు తీసుకెళ్లాడు. విచారణలో భాగంగా దేవీలాల్‌కు నోటీసు ఇచ్చి సంతకం చేయాలని కోరారు. అక్కడ ఉన్న దేవీలాల్ అనుచరులు కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. దీనంతటిని అక్కడే ఉన్న వ్యక్తిఫోన్‌లో రికార్డు చేశాడు. ఇక వారి నుంచి ఎలాగో తప్పించుకున్న కానిస్టేబుల్ కనకయ్య పటాన్ చెరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దేవీలాల్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: సైనిక విమానం కూలి 12మంది మృతి.. యాంగూంన్ సమీపంలో ప్రమాదం.