Fake Documents: అసైన్డ్ భూములకు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి స్థలాలను విక్రయించే కేడీ బ్యాచ్

|

Jul 07, 2021 | 7:38 PM

మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు, నాగరాజులు డబ్బులు అవసరమైనప్పుడు ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి అవసరమైన స్టాంఫ్ పేపర్లను విజయవాడకు..

Fake Documents: అసైన్డ్ భూములకు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి స్థలాలను విక్రయించే కేడీ బ్యాచ్
Fake Documents
Follow us on

Fake Documents: అసైన్డ్ భూములకు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి స్థలాలను విక్రయించే ముఠాను గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. మంగళగిరి రత్నాల చెరువులో ప్రభుత్వం కొంత మందికి పట్టాలిచ్చింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఖాళీ స్థలాలకు పాత తేదీలతో ఉన్న డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ చెప్పారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు, నాగరాజులు డబ్బులు అవసరమైనప్పుడు ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి అవసరమైన స్టాంఫ్ పేపర్లను విజయవాడకు చెందిన వక్కలగడ్డ విటల్ దగ్గర పాత తేదీలతో కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన స్టాంప్ పేపర్లపై ఇతరుల పేర్లతో నకిలీ లింక్ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. వాటిని కొనుగోలు దారులకు చూపించి విక్రయిస్తారు. అసలు డాక్యుమెంట్లే ఉండని స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.

ఇప్పటివరకూ 92,90,000 రూపాయల వరకూ క్రయవిక్రయాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై మొత్తంగా పదమూడు కేసులు నమోదు చేశారు. నలుగురిపై 120బి, 409,471,268 సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. లైసెన్స్ రద్దైన స్టాంఫ్ వెండార్ విఠల్ వద్ద నుండి నలభై వేల రూపాయల నగదు, ఆరు బంగారు ఉంగరాలు, ఖాళీ నాన్ జ్యూడిషియల్ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పూర్తి స్థాయి విచారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Fale Documents Rocket

Read also : Etela: ‘ఆ లేఖ నాది కాదు..’ మధువని గార్డెన్‌లో రాజేందర్ రుస రుస.! హుజూరాబాద్ ప్రజలకు నివేదన