Former DGP Prasad Rao : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కి డీజీపీగా సేవలందించిన ప్రసాద్ రావ్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రసాద్ రావ్ అమెరికాలో అతడి కూతురు దగ్గరు ఉంటున్నారు. తీవ్ర ఛాతి నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నిం చేశారు.. అప్పటికే నొప్పి ఎక్కువ కావడంతో మృతి చెందారు. ఆయనకు కొడుకు వికాస్, సౌమ్య కుమార్తె, కొన్ని నెలల మనవడు ఉన్నారు. అతడి అకాల మరణంతో కుటుంబంలో విషాద ఛయాలు అలుముకున్నాయి. ప్రసాదరావు హైదరాబాద్ సీపీగా, ఏసీబీ డీజీగా, ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు అతడి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ డీజీపీ ప్రసాద్ రావ్ ప్రస్థానం..
ప్రసాద రావు తీరప్రాంత ఆంధ్రాలోని గుంటూరు జిల్లాకు చెందినవాడు .అక్టోబర్ 1, 2013 న ఏపీ రాష్ట్ర పోలీసు దళాలకు ఇన్‌చార్జ్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఐఐటి మద్రాసు నుంచి భౌతికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ప్రసాద రావు 1979 లో పోలీసు సేవలో చేరారు. అతనికి ఏపీ కేడర్ కేటాయించారు. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు ఎస్పీగా పనిచేసిన ఆయన ఎస్పీ విజిలెన్స్ సెల్, ఎస్పీ ఇంటెలిజెన్స్, విశాఖపట్నం, భోపాల్ వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ కమాండెంట్‌గా పనిచేశారు. అతను ఏలూరు, కర్నూల్ శ్రేణుల డీఐజీ, యాంటీ కరప్షన్ బ్యూరో అదనపు డైరెక్టర్, సెక్యూరిటీ వింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డీఐజీగా, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. అతను APSRTC అదనపు DG (లా అండ్ ఆర్డర్), అదనపు DG (ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్) వైస్ చైర్మన్, MD గా కూడా పనిచేశారు.