Lightning Strike in Bihar: పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన బీహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రీ బక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం వర్షం కురిసే సమయంలో కొంత మంది పిల్లలు చంకా గ్రామంలోని పండ్ల తోటలో ఉన్నారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో వారంతా ఓ చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో పిడుగుపడడంతో నలుగురు పిల్లలతో సహా ఓ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారిని మనీషా కుమారి, సంజన కుమారి, కైలాష్ కుమార్, 75 ఏళ్ల మహిళ భదయ్య దేవిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరు పిల్లల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం.. రూ.4లక్షల పరిహారం అందజేయనున్నట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డీఓ) వీరేంద్రకుమార్ పేర్కొన్నారు.
Bihar: 5 people including 4 children died due to a lightning strike in Bhaktiarpur police station limits in Saharsa district, earlier today.
Police says,”One person who was injured is safe now.” pic.twitter.com/5OGwIBeAdC
— ANI (@ANI) June 28, 2021
Also Read;