Fire Accident: ప్రతి రోజు ఎన్నో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. షార్ట్ సర్య్కూట్ కారణంగానో, ఇతర కారణాల వల్లనో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక వాహనాల్లో కూడా షార్ట్ సర్య్కూట్ కారణంగా వాహనాలు దగ్ధమవుతున్నాయి. దీంతో భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక తాజాగా విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం (Visakha Fire Accident)చోటు చేసుకుంది. పెందుర్తి ఆనందపురం దగ్గర ప్రమాదవశాత్తు ఓ అగ్గిపెట్టెల లారీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో లారీలో భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం కారణంగా సుమారు 4 కిలోమీటర్ల మేరకు వాహనాలన్నీ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరుగగానే లారీ డ్రైవర్, క్లీనర్‌లు అప్రమత్తమై ప్రాణాలను కాపాడుకున్నారు.
ఇవి కూడా చదవండి: