Fire Accident in Mumbai: ఆర్థిక రాజధాని ముంబైలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో శుక్రవారం చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. డంప్ యార్డ్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 19 అగ్నిమాపక దళాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని శనివారం అధికారులు పేర్కొన్నారు.
అయితే డంప్ యార్డుకు చుట్టు పక్కల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కర్మాగారాలు, గోడౌన్లు ఉండటంతో ఆయా ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. డంప్ యార్డులో మొదలైన మంటలు.. క్రమంగా గోడౌన్ల వైపు చేరుతుండటంతో బీఎంసీ అధికారులు మరిన్ని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ముందస్తుగా ఆయా ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మంటలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
#UPDATE: The fire that broke out at godowns in Mumbai’s Mankhurd yesterday has been doused. https://t.co/wV8IJUv7gu
— ANI (@ANI) February 6, 2021
Also Read: