Fire Accident: అగ్ని ప్రమాదాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్త, షాట్‌సర్య్కూట్, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు సంభవించి భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవిస్తోంది. కొన్ని కొన్ని సమయాల్లో ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఇక తాజాగా విశాఖపట్నంలోని సూర్యాబాగ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవన్ ఎలక్ట్రికల్స్ షాపులో ప్రమాదవశాత్తు భారీగా మంటలు చెలరేగాయి. షాపుతో పాటు పైనున్న గోడౌన్‌లోనూ మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమని ఫైర్ సిబ్బంది నిర్ధారించారు.
ఇవి కూడా చదవండి: