
లంచం..లంచం.. లంచం.. వినడానికి రెండు అక్షరాలే. కానీ నిండు కుటుంబాన్ని నిలువునా ముంచేస్తోంది. కాయాకష్టం చేసుకుని బతుకీడుస్తున్న నిరుపేదలను ఈ మహమ్మారి తీవ్రంగా వేధిస్తోంది. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు లంచం రక్కసికి బలైన కుటుంబాలెన్నో. సమాజంలో ఏ పని జరగాలన్న లంచం ఇవ్వాల్సిందే. లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదన్నది నగ్నసత్యం. తాజాగా బిహార్ లో ఇలాంటి ఘటనే జరిగింది. చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేందుకు ఏకంగా రూ.50 వేలు డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తేనే శవం ఇస్తామని చెప్పారు. అంత డబ్బు తమ వద్ద లేదని, కూలీనాలీ చేసుకునే తాము ఆ డబ్బు ఎలా తీసుకురాగలమని వేడుకున్నా ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు. డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ తండ్రి..జోలె పట్టుకుని, ఊరుఊరు తిరుగుతూ భిక్షమెత్తుకుంటున్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిహార్ లోని సమస్తిపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమారుడు కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. అతని కోసం గాలించినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
ఈ సమయంలో వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కనిపించకుండా పోయిన బాలుడు చనిపోయాడని, అతని మృతదేహం తమవద్ద ఉందని చెప్పారు. వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర దుఖంలోనూ ఆ తల్లిదండ్రులు బాలుడి మృతదేహం కోసం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడికి వెళ్తే.. ఆస్పత్రి సిబ్బంది మృతదేహాం ఇచ్చేందుకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో షాక్ అయిన తండ్రి.. అంత డబ్బు తమ వద్ద లేదని, తాము ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బిచ్చమెత్తాడు. ఊరు ఊరు తిరుగుతూ డబ్బులు అడుగుతున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
बेटे की लाश चाहिए तो 50 हजार रुपये लाओ, वरना जाओ। गरीब पिता को भीख मांगनी पड़ी। फिर भी पैसा नहीं जुटा पाए। लाश छोड़नी पड़ी।
बिहार के समस्तीपुर में मानवता को शर्मसार करने वाली घटना हुई है।@NitishKumar @mangalpandeybjp
#Bihar #बिहार #BiharNews #samastipur pic.twitter.com/PlPq486r1z— Braj Mohan Mishra (@BrajMoh91150747) June 9, 2022
కాగా.. ఈ ఆసుపత్రిలో పనిచేస్తోన్న చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. గత కొన్ని రోజులుగా వారికి జీతాలు సరిగా లేకపోవడంతో ఇలా రోగుల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. వీడియో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. ఇది అమానవీయ ఘటన అని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. బాలుడి మృతదేహం పోలీసు కస్టడీలో ఉందని, అందువల్లే అప్పగించడం సాధ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి