FARMERS PROTEST: ట్రాక్టర్‌ పల్టీ కొట్టడం వల్లే రైతు మృతి.. సీసీ ఫుటేజీని విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు..

|

Jan 27, 2021 | 5:16 AM

FARMERS PROTEST: గత కొద్ది రోజులుగా నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

FARMERS PROTEST: ట్రాక్టర్‌ పల్టీ కొట్టడం వల్లే రైతు మృతి.. సీసీ ఫుటేజీని విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు..
Follow us on

FARMERS PROTEST: గత కొద్ది రోజులుగా నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్‌ పరేడ్‌‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఒక్కసారిగా దేశ రాజధాని దద్ధరిల్లింది. ఈ గొడవల్లో ఓరైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రైతు మరణానికి పోలీసులే కారణమంటూ ఐటీఓ కూడలిలో రైతులు ఆందోళన చేపట్టారు.
దీన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్‌ పల్టీ కొట్టడం వల్లే ఆ రైతు మరణించాడని స్పష్టంచేశారు.

ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని విడుదల చేశారు. అతివేగంగా బారికేడ్లవైపు దూసుకొచ్చిన ట్రాక్టర్‌, వాటిని ఢీకొట్టి పల్టీ కొట్టడంతోనే రైతు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రకటించారు. ట్రాక్టర్‌ పరేడ్‌ చేపట్టిన రైతు సంఘాలు ముందస్తుగా అంగీకరించిన నిబంధనల్ని ఉల్లంఘించారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అనుమతించిన సమయం కన్నా ముందే ర్యాలీని ప్రారంభించడమే కాకుండా హింస, దాడులకు రైతులు కారణమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ ఆందోళనలతో భారీ స్థాయిలో ప్రజా ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు చాలా మంది పోలీసులు గాయాల పాలయ్యారని పోలీసులు తెలిపారు.

సమయానికి రైలు ఎక్కలేకపోయారా.. అయితే మీ టికెట్ సొమ్ము వాపస్.. అయితే ఈ అవకాశం ఎక్కడో తెలుసా..