Crime News: రెచ్చిపోయిన దొంగలు.. తుపాకులతో షాపులోకి ప్రవేశించి కాల్పులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? Viral Video
Shop looting: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. షాపులోకి తుపాకులతో ప్రవేశించిన దుండగులు.. అడ్డొచ్చిన వ్యాపారవేత్త తండ్రి, మరోవ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం
Shop looting: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. షాపులోకి తుపాకులతో ప్రవేశించిన దుండగులు.. అడ్డొచ్చిన వ్యాపారవేత్త తండ్రి, మరోవ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన హర్యానా పరిధిలోని ఫరీదాబాద్‌లోని సెక్టార్ -23 సంజయ్ కాలనీలో చోటుచేసుకుంది. మోహిత్ సంజయ్ అనే వ్యక్తి ఫరీదాబాద్ సెక్టార్ 23లోని రాజేంద్ర చౌక్ సమీపంలో కిరాణా దుకాణం నడుతున్నాడు. దుకాణంపై అంతస్థులో అతను కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో.. షాప్‌కీపర్ షాపును మూసి వేస్తున్నాడు. ఈ క్రమంలో ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు అక్కడికి వచ్చి షాపులోకి ప్రవేశించారు. అనంతరం షాప్ కీపర్‌ను నెట్టి వేసి షట్టర్‌ను మూసివేశారు.
తుపాకులతో దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు వ్యాపారిని, షాప్‌కీపర్‌ను బందీలుగా తీసుకొని కొట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెడలో ఉన్న బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, లాక్కున్నారు. అనంతరం షాపులో ఉన్న సుమారు 4-5 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఈ క్రమంలో అరుపులు విన్న వ్యాపారి తండ్రి వేద్ అగర్వాల్ కిందకు వచ్చాడు. ఈ లోగా దుండగులు దోచుకుని బైక్ వద్దకు వెళ్లారు. మూడో దుండగుడు పారిపోయేందుకు బైక్‌ను స్టార్ట్ చేస్తుండగా.. వ్యాపారి తండ్రి వేద్ అగర్వాల్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే నేలకొరిగాడు. అటుగా వెళ్తున్న గౌరవ్ అనే యువకుడు కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపై కూడా దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు.
వైరల్ వీడియో..
తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫరీదాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను గుర్తించడానికి పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Also Read: