Fake Bills Scam: నకిలీ బిల్లులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

Fake Bills Scam: నకిలీ బిల్లులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు కటకటాల పాలయ్యారు. కష్ట పడకుండా సంపాదించాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కిన ముగ్గురు ...

Fake Bills Scam: నకిలీ బిల్లులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

Updated on: Jan 07, 2021 | 10:38 PM

Fake Bills Scam: నకిలీ బిల్లులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు కటకటాల పాలయ్యారు. కష్ట పడకుండా సంపాదించాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కిన ముగ్గురు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నకిలీ బిల్లులు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్న వీరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

అయితే బోగస్ సంస్థల పేరుతో బిల్లులు తయారు చేస్తున్న ముఠా రూ.32.54 కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారం చేయకుండానే రూ.19.1 కోట్ల జీఎస్టీ రిఫండ్ తీసుకున్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. బీహార్ కు చెందిన ముఖేష్, సంజయ్ జోషి, రాహుల్ అగర్వాల్ లను అరెస్టు చేశారు. వీరిపై పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు. వీరు ఇంకేలాంటి మోసాలకు పాల్పడ్డారోనని ఆరా తీస్తున్నారు.

Fruit Vendor Murder case: పళ్ల వ్యాపారి ప్రాణం తీసిన రూ.10.. హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్