హైదరాబాద్ దమ్మాయిగూడలోని పద్మశాలి టౌన్‌షిప్‌లో ఓ యువకుడు ఎయిర్‌గన్‌తో హల్‌చల్ చేశాడు. ఓ యువతిని వేధిస్తూ ఆమె సోదరుడిని పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన యువతి గీతాంజలి కళాశాలలో బీటెక్ చదువుతూ దమ్మాయిగూడ లేక్‌వ్యూ కాలనీలోని బంధువుల ఇంట్లో నివాసముంటోంది.
దమ్మాయిగూడ సాయిబాబానగర్‌కు చెందిన అభిషేక్ అదే కళాశాలలో చదువుతూ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం యువతి సోదరుడు భానుప్రకాశ్‌ను పద్మశాలి టౌన్‌షిప్‌కు పిలిపించి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఉపయోగించిన ఎయిర్‌గన్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బొమ్మతుపాకీ అని పోలీసులు నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.