cricket betting Suicide : యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. తెలియని మాయ ప్రపంచంలో ఇరుక్కుని బయటకు రాలేక నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఇలా తీవ్ర నష్టాలు చవిచూసినవారిలో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులు అవుతారని ఆశలు పెట్టుకున్న తల్లితండ్రులకు తీవ్ర గర్భశోకం మిగులుస్తున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసగా మారిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం రాళ్లబూదుగురు గ్రామానికి చెందిన కిరణ్ కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చుట్టూ ఉన్న విద్యార్థుల్లో కొందరు బెట్టింగ్ కడుతూ సులభమైన మార్గంలో డబ్బు సంపాదించడం గమనించాడు. తాను బెట్టింగ్ చేస్తే అధికంగా డబ్బులు వస్తాయని భావించి క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు.
ఇదేక్రమంలోనే మొదట తన పాకెట్ మనీతో ప్రారంభించి బెట్టింగ్, స్నేహితుల వద్ద అప్పులకు దారి తీసింది. ఇలా ఒకరి నుంచి మరొకరి దాకా పాకి వందలు వేలుగా మారాయి. అయితే తొలుత వచ్చిందని ఆనందపడ్డ కిరణ్.. తర్వాత నష్టాలను చవిచూశాడు. పూర్తిగా అప్పులో కూరకుపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు ఇతరుల నుంచి భారీగా వసూలు చేశాడు. దీంతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. అప్పులు తీర్చాలంటూ ఒత్తిడు పెరిగిపోయాయి. దీంతో కిరణ్ తీవ్ర మానసకి వేదనకు లోనయ్యాడు. కొద్ది రోజులుగా స్నేహితులతో కూడా సరిగా మాట్లాడం లేదు. మరోవైపు బెట్టింగ్ చేసిన అప్పుల వేధింపులు తట్టుకోలేకపోయాడు.
ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో తనలాగా ఎవరూ బెట్టింగ్ చేయకండి అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. బెట్టింగ్ వల్ల జీవితాలను చిదిమేసుకోకండి అని కోరాడు. ఈ పోస్ట్ చేసిన 8 గంటల తర్వాత కుప్పం మండలం బంగారునత్తం రోడ్డులోని మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చెట్టంత ఎదిగిన కొడుకు రేపో మాపో ఉద్యోగంలో చేరుతాడనుకుంటే ప్రాణాలు వదిలివేడం ఆ కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి… Lady Doctors Celebrations:లేడీ వైద్యుల బృందం 130 మంది శిశువులను ప్రసవించినందుకు వేడుకల