చెన్నై: సింగమలై అటవీ ప్రాంతంలో ఏనుగు దాడి.. ఫారెస్ట్ అధికారి సహా ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
సింగమలై అటవీ ప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఘటనలో ఫారెస్ట్ అధికారి సతీష్ సహా ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స....

సింగమలై అటవీ ప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఘటనలో ఫారెస్ట్ అధికారి సతీష్ సహా ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వన్య మృగాల వివరాలు సేకరించేందుకు అధికారులు అటవీ ప్రాంతానికి వెళ్లారు.
కాగా, అటవీ శాఖ అధికారులు వన్య మృగాల వివరాలు సేకరించేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు వివరాలు సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఏడును ఈ దాడి చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమైనప్పటికీ, ఏనుగు ఇద్దరిని బలి తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో ఏనుగులు అధిక సంఖ్యలో ఉంటాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. కాగా, ఇటీవల ఏనుగులపై కొందరు అకతాయిలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏనుగులపై దాడులు జరిగాయి. దీంతో అధికారుల కూడా వన్య మృగాల పరిరక్షణ విషయంలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.
