AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేల కోట్ల కుంభకోణం.. నట్టేట మునిగిన చెరుకు రైతులు

చెరుకు రైతులను మహారాష్ట్రలోని ఓ చక్కెర కర్మాగారం నట్టే ట ముంచేసింది. ఏకంగా రైతుల భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 5,400 కోట్ల రూపాయల రుణం తీసుకుని భారీ కుంభకోణానికి తెర లేపింది. ఈ స్కామ్‌లో బీజేపీ మిత్రపక్షం ఆర్ఎప్పీ నేత రత్నాకర్ గుత్తేకు సంబంధం ఉండటం రాజకీయంగా సంచలనం రేపుతుంది. మహారాష్ట్రలో గంగఖేడ్ షుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అనే చక్కెర కర్మాగారానికి రత్నాకర్ గుత్తే ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల చెరకు రైతుల […]

వేల కోట్ల కుంభకోణం.. నట్టేట మునిగిన చెరుకు రైతులు
Anil kumar poka
|

Updated on: Jun 07, 2019 | 5:14 PM

Share

చెరుకు రైతులను మహారాష్ట్రలోని ఓ చక్కెర కర్మాగారం నట్టే ట ముంచేసింది. ఏకంగా రైతుల భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 5,400 కోట్ల రూపాయల రుణం తీసుకుని భారీ కుంభకోణానికి తెర లేపింది. ఈ స్కామ్‌లో బీజేపీ మిత్రపక్షం ఆర్ఎప్పీ నేత రత్నాకర్ గుత్తేకు సంబంధం ఉండటం రాజకీయంగా సంచలనం రేపుతుంది.

మహారాష్ట్రలో గంగఖేడ్ షుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అనే చక్కెర కర్మాగారానికి రత్నాకర్ గుత్తే ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల చెరకు రైతుల నుంచి ఈ కంపెనీ పంట కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి 600 మంది రైతుల భూ వివరాలు సేకరించింది. రైతులకు తెలియకుండా వారి పంట, రవాణా పథకం కింద బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రుణం పొందింది. రూ.25 లక్షలు బకాయి ఉన్నారంటూ బ్యాంకుల నుంచి నోటీసులు అందడంతో రైతులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.

రైతుల తరపున ఎన్సీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. కాగా, పోలీసుల దర్యాప్తులో ఇది వేల కోట్ల కుంభకోణం అని బయటపడటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కంపెనీ నిర్వాహకులు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తూ.. కంపెనీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేపట్టింది. ముంబై, పర్బని, నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీ కార్యాలయాల్లో సోదాలు జరిపి పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..