తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎస్పీ వేలుమణి ( SP Velumani) ని అవినీతి ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన ఇంట్లో మరోసారి సోదాలు నిర్వహించారు విజిలెన్స్ విభాగం అధికారులు. వేలుమణి ఇల్లు, ఆఫీస్, మాజీ మంత్రి కి సంబంధమున్న కంపెనీలన్నింటిలో సోదాలు నిర్వహించింది. కాగా నెల రోజుల క్రితం జరిపిన సోదాల ఆధారంగా మూడు విభాగాలలో వేలుమణిపై కేసు నమోదైంది. కాగా నేడు మళ్లీ విజిలెన్స్ సోదాలు ( Vigilance Raids) నిర్వహించడం తో వేలుమణి ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు భారీగా మాజీ మంత్రి ఇంటికి చేరుకుంటున్నారు. అధికార డీఎంకే కావాలనే అన్నాడీఎంకే నేతలను వేధిస్తోందని, కక్ష పూరితంగానే జైలు కి పంపడానికి ఏసీబీ ని వాడుకుంటున్నారని అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై వేలుమణిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా వివిధ పథకాల కింద అమలు చేయాల్సిన పనుల్లో వేలుమణి రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు గతంలో కోయంబత్తూరుకు చెందిన డీఎంకే సభ్యుడు రఘునాథ్ కోవై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కోవై కార్పొరేషన్‌తో పాటు పక్కనున్న మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, కొందరు శాసనసభ్యులు కలిసి ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇలా కోవైలో జరిగే అన్ని పనులకు మంత్రి తన వాటాగా 12 శాతం కమీషన్ తీసుకున్నారని రఘునాథ్ కోవై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా వివిధ పథకాల ముసుగులో రూ.1,500 కోట్ల వరకు మాజీ మంత్రి వేలుమణి అవినీతికి పాల్పడినట్లు రఘునాథ్ కోవై ఆరోపించారు.
Also Read:IndusInd Bank FD: ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారా..? వడ్డీ రేట్లలో మార్పు
Vizag Customs Jobs 2022: పదో తరగతి అర్హతతో విశాఖపట్నం కస్టమ్స్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!