Drugs Seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.53 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. మహిళ అరెస్ట్

Drugs Worth rs 53 Crores Seized: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్

Drugs Seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.53 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. మహిళ అరెస్ట్
Drugs Seized

Updated on: Jun 06, 2021 | 10:20 AM

Drugs Worth rs 53 Crores Seized: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఓ మహిళపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా.. 8 కిలోల‌ హెరాయిన్‌ లభ్యమైనట్లు క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకోని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కుల‌ వ‌చ్చిన మ‌హిళ వ‌ద్ద మాద‌క‌ద్ర‌వ్యాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో డీఆర్ఐ అధికారులు మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా క‌రోల్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. చెన్నై విమానాశ్రంలో కూడా 10కేజీల హెరాయిన్ లభ్యమైనట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీని విలువ రూ.73 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మహిళ కూడా సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళగా అధికారులు తెలిపారు. అయితే.. ఇటు శంషాబాద్, అటు చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టుబడటంతో డీఆర్ఐ అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిద్దరికీ లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ ప్రశ్నిస్తున్నారని.. ఎక్కడి నుంచి ఎక్కడకు హెరాయిన్ చేరవేస్తున్నారని, దీని వెనుక ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:

కేరళ నర్సులకు ఢిల్లీ ఆస్పత్రి ఆదేశాలపై వివాదం.. మండిపడుతున్న మలయాళీలు

Chinese Virologist: అక్కడి నుంచే కరోనా వైరస్ వచ్చింది.. ఫౌచీకి తెలుసంటున్న చైనీస్ వైరాలజిస్ట్