Drugs Seized in Kashmir: పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ఆయుధాలతో పాటు మాదక ద్రవ్యాలు కూడా స్మగ్లింగ్ అవుతున్నాయి. సరిహద్దుల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో భద్రతాదళాలు రూ.25 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సరిహద్దు వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వెంటనే రెక్కీ నిర్వహించగా.. సరిహద్దు ఆవతలి నుంచి తరలించిన 30 కిలోల హెరాయిన్ లభ్యమైనట్లు బారాముల్లా సీనియర్ ఎస్పీ రాయీస్ అహ్మద్ చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని.. డ్రగ్స్‌కు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ జరుపుతున్నామని తెలిపారు.
ఈ హెరాయిన్ విలువ రూ. 25 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇదిలాఉంటే.. పంజాబ్‌లోనూ భద్రతా బలగాలు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. పాక్ సరిహద్దులోని రాజతల్ గ్రామ సమీపంలో ఆరు కిలోల హెరాయిన్ పట్టుబడ్డట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని కూడా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: