Marriage Broken: వివాహం ముగిసింది.. ఊరేగింపు ముందు వరుడి డిమాండ్లు.. వధువుని వదిలిపెట్టి..

|

Jul 06, 2021 | 8:04 AM

Dowry Demand Groom: పెళ్లి తంతు అంతా ముగిసింది. కొంతసేపటి తరువాత ఊరేగింపు ప్రారంభమవుతుంది అనుకున్నారంతా.. అంతటా సందడి నెలకొంది. ఈ క్రమంలోనే వధువు,

Marriage Broken: వివాహం ముగిసింది.. ఊరేగింపు ముందు వరుడి డిమాండ్లు.. వధువుని వదిలిపెట్టి..
Marriage Broken
Follow us on

Dowry Demand Groom: పెళ్లి తంతు అంతా ముగిసింది. కొంతసేపటి తరువాత ఊరేగింపు ప్రారంభమవుతుంది అనుకున్నారంతా.. అంతటా సందడి నెలకొంది. ఈ క్రమంలోనే వధువు, ఆమె తల్లిదండ్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. దండలు మార్చుకొని ఊరేగింపు ప్రారంభం అయ్యే క్రమంలో వరుడు షరతులు పెట్టాడు. బైక్, ఇంకా వరకట్నం కావాలంటూ డిమాండ్ చేశాడు. అలా అయితే తన ఇంటికి తీసుకెళతానని.. నవ వధువును వదిలిపెట్టి పోయాడు.. ఆ ప్రభుద్ధుడు. దీంతో ఆ పేద రైతు కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లక్కారు. ఈ దారుణ సంఘటన.. రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాహ వేడుక గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా వధువు తండ్రి సుర్జారామ్ మాట్లాడుతూ.. తన కుమార్తెకు జూలై 3న బుగాలా గ్రామానికి చెందిన అజయ్‌తో వివాహం జరిగిందని పేర్కొన్నాడు. పెళ్లితంతు అంతా పూర్తియ్యిందని, విందు కూడా ముగిసిందన్నాడు. తరువాత దండలు మార్చుకుని ఊరేగింపు చేపట్టే సమయంలో వరుడి తరపువారు కట్నకానుకలు డిమాండ్ చేశారన్నాడు. బైక్, లక్షా ముప్పై వేలు నగదు కావాలని చెప్పారన్నాడు. తాను పేద రైతునని.. కట్నకానుకలు ఇచ్చుకోలేనని చెప్పడంతో వరుడి కుటుంబసభ్యులు వెళ్లిపోయారని తెలిపాడు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. ఈ మేరకు వధువు తరపున కుటుంబసభ్యులు జిల్లా పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడతామని అధికారులు పేర్కొన్నారు.

Also Read:

Covid-19 Fake Report: భార్య నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్.. కరోనా ఫేక్‌ రిపోర్ట్‌‌తో వేషాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Central Cabinet: కేంద్ర కేబినెట్‌లోకి కొత్తగా 20 మందికి చోటు.. రేపు లేదా ఎల్లుండి మంత్రి మండలి విస్తరణకు అవకాశం!