Crime News: ఎంపీ వరకట్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన కోడలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

| Edited By: Janardhan Veluru

Aug 19, 2021 | 4:23 PM

ఒడిశా రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యుడిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడిపై భోపాల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Crime News: ఎంపీ వరకట్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన కోడలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Dowry Harassment
Follow us on

Harassment Case gainst BJD MP: ఒడిశా రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యుడి(MP)పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఎంపీతో పాటు ఆయన భార్య, కుమారుడిపై భోపాల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు రిజిస్ట్రర్ అయ్యింది. భాదితురాలి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదైన విషయాన్ని పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ ధ్రువీకరించారు. బీజేడీకి చెందిన భర్తృహరి మహతాబ్‌ కటక లోక్‌సభ నియోకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భోపాల్‌కు చెందిన భర్తృహరి మహతాబ్‌, ఆయన కుటుంబీకులు వరకట్న వేధింపులకు పాల్పడుతున్న ఎంపీ కోడలు (34 ఏళ్ల)  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ భర్తృహరి మహతాబ్‌ కుమారుడు లోకరంజన్ మహతాబ్‌తో తన వివాహం 2016 డిసెంబర్ నెలలో జరిగినట్లు బాధితురాలు తెలిపారు. పెళ్లి సమయంలో తన తండ్రి కట్నకానుకలు చాలా ఇచ్చారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివాహం అనంతరం భర్తతో పాటు అత్తమామలు మరింత కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తూ వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపులతో విసిగిపోయిన ఆమె చాలాసార్లు పుట్టింటికి వెళ్లింది. 2018 లో ఆమె న్యూఢిల్లీలోని ఏబీ-94 షాజహాన్ రోడ్‌లోని తన అత్తమామల ఇంటికి చాలాసార్లు వెళ్లింది. కానీ, ఆమెను వారు ఇంట్లోకి రానీయలేదు. ఇంటి తలుపులు కూడా తెరవలేదు. అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు తన ఫిర్యాదులో తెలిపారు.

బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎంపీతో పాటు ఆయన భార్య మహాశ్వేత, కుమారుడు లోకరంజన్‌పై కూడా నిందితులుగా ఉన్నారు. ఎంపీపై వరకట్న వేధింపులతోపాటు రాజద్రోహం, బెదిరింపులకు పాల్పడిన అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ కోడలి వేధింపుల ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే నిందింతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read Also…  Afghan Crisis: విదేశాల్లో శిక్షణ తీసుకున్న సైన్యాన్ని, పైలెట్లను విధుల్లోకి చేరమంటున్న తాలిబన్లు.. ప్రపంచ దేశాల్లో ఆందోళన