Hyderabad: దారుణ ఘటన.. సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించుకుని డాక్టర్ బలవన్మరణం..

|

Dec 12, 2021 | 9:55 AM

Doctor Suicide: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించుకుని ఓ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన

Hyderabad: దారుణ ఘటన.. సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించుకుని డాక్టర్ బలవన్మరణం..
Doctor Suicide
Follow us on

Doctor Suicide: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించుకుని ఓ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఎస్సార్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సార్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ కడప జిల్లా బద్వేలుకు చెందిన డాక్టర్ రాజ్‌కుమార్‌ (29) అమీర్‌పేట శ్యామ్‌కరణ్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వైద్యుడు బీకేగూడలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే.. శుక్రవారం స్నేహితుడికి ఫోన్‌ చేసి తన మనసు బాగోలేదంటూ పలు విషయాలు చెప్పాడు. అనంతరం కాసేపటికే స్నేహితుడు తిరిగి ఫోన్‌ చేసినా రాజ్ కుమార్ స్పందించలేదు.

దీంతో అనుమానం వచ్చిన స్నేహితుడు.. మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారమిచ్చాడు. అతను హుటాహుటిన వచ్చి చూడగా.. రాజ్‌కుమార్‌ తన చేతికి సెలైన్‌ బాటిల్‌ పెట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి కొండిపల్లి సుబ్బారావు ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెలైన్‌లో విషం ఎక్కించుకుని రాజ్ కుమార్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Watch Video: మొబైల్ షాప్‌లో గొడవ.. వేట కత్తితో రెచ్చిపోయిన ఉద్యోగి.. అసలేమైందో తెలుసా..? వీడియో

Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో వాకర్స్‌పైకి..

Indian Railway: రైల్వే ఆదాయంలో 49 శాతం పెరుగుదల.. 8 నెలల్లో రూ.14184 కోట్ల ఆదాయం