AP Crime News: మద్యం విషయంలో విబేధాలు.. ఓ వ్యక్తిని చంపేందుకు గన్ కొనుగోలు చేసి..

| Edited By: Ravi Kiran

Feb 18, 2022 | 11:47 AM

Guntur District Crime News: అక్రమ మద్యం వ్యాపారంలో వారంతా ఆరితేరారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కొనుగోలు చేసి దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో విక్రయించే వారు. కానీ

AP Crime News: మద్యం విషయంలో విబేధాలు.. ఓ వ్యక్తిని చంపేందుకు గన్ కొనుగోలు చేసి..
Guntur Crime
Follow us on

Guntur District Crime News: అక్రమ మద్యం వ్యాపారంలో వారంతా ఆరితేరారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కొనుగోలు చేసి దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో విక్రయించే వారు. కానీ మధ్యలోనే మనస్పర్థలు రావడంతో అసలు కథ మొదలైంది. దీంతో రెండు గ్రూపుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. దీంతో గ్రూపులోని ఓ కీలక వ్యక్తిని హత్య చేసేందుకు.. మరో వ్యక్తి ప్లాన్ వేశాడు. ఎయిర్ గన్ కొనుగోలు చేసి.. స్కెచ్ వేశాడు.. కానీ చివరకు ప్లాన్ ఫేయిలయింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాచేపల్లి (Dachepalle) కి శ్రీకాంత్ అక్రమ మద్యం వ్యాపారం చేస్తుంటాడు. అయితే గత ఏడాది అక్రమ మద్యం తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కేసులు నమోదు చేశారు. తమ (Illegal Liquor) వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది దాచేపల్లికే చెందిన నరసింహారావే అని శ్రీకాంత గ్యాంగ్ భావించింది‌. దీంతో నరసింహరావుపై కక్ష పెంచుకుంది. అవసరమైతే నరసింహారావు అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. హైదరాబాద్ వెళ్లి ఎయిర్ పిస్టల్, తుపాకి కొనుగోలు చేశారు.

నాలుగు రోజుల క్రితం నరసింహారావు ఒంటరిగా దాచేపల్లిలో శ్రీకాంత్ అతని స్నేహితులకు ఒంటరిగా కనిపించాడు. వెంటనే శ్రీకాంత్ గ్యాంగ్ అతనిపై దాడికి పాల్పడింది. అదే సమయంలో స్థానికులు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికుల బారి నుంచి తప్పించుకునేందుకు శ్రీకాంత్ ఎయిర్ పిస్టల్‌తో కాల్పులు జరిపి అక్కడ నుంచి తప్పించుకున్నారు.

ఈ ఘటనపై నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంత్‌తో పాటు అతని స్నేహితులు రవీంద్ర, వెంకటేశ్వర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి తుపాకి, ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.

తుపాకీ కాల్పులతో పట్టణంలో ఒక్కసారిగా అలజడి రేగింది‌. స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. మొత్తం మీద పోలీసులు నిందితులను అరెస్టు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

టి. నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు

Also Read:

Crime News: అనంతపురంలో మరో కీచక టీచర్.. విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన..!

పంచలోహ విగ్రహాల పేరుతో మోసం.. ముఠా అరెస్టు.. మరో ఘటనలో