చిన్నారులపై అత్యాచారాలకూ, పోర్న్ సైట్లకూ లింక్! 9 ఏళ్ల పాప హత్యాచారం కేసు ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
అత్యాచారాలకూ పోర్న్ సైట్లకూ సంబంధముందా? చిన్నారులపై లైంగిక దాడులకు రిలేషనుందా? గత ఆగస్ట్ లో జరిగిన చిన్నారి హత్యాచార ఘటన ఏం చెబుతోంది?
అత్యాచారాలకూ పోర్న్ సైట్లకూ సంబంధముందా? చిన్నారులపై లైంగిక దాడులకు రిలేషనుందా? గత ఆగస్ట్ లో జరిగిన చిన్నారి హత్యాచార ఘటన ఏం చెబుతోంది? 9 ఏళ్ల పాపను అత్యాచారం చేసి చంపేసిన ఉదంతంలో ఇదే నిజం బయట పడిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఆగస్ట్ 2న ఢిల్లీలో 9 ఏళ్ల పాపపై హత్యాచారం జరిగింది. స్మశానంలోని ఓ నలుగురు కామాంధులు ఆ చిన్నారిపై అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా.. ఊపిరాడకుండా చేసి చంపేశారు. అదేమంటే ఆమె కరెంటు షాక్ కొట్టి చనిపోయిందని కట్టు కథలు అల్లారు. ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండానే అక్కడికక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయంపై మృతురాలి తల్లి కంప్లయింట్ చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగి కేసు మొత్తం కూపీలాగారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ప్రధాన నిందితుడు రాధేశ్యామ్ పోర్న్ సైట్స్ ను ఎక్కువగా చూసేవాడని తేలింది. మొత్తం 1300 సైట్లను ఇతడు చూసినట్టుగా నిర్దారించారు పోలీసులు. చనిపోయిన బాలికను కూడా పోర్న్ చూడాలని పలుమార్లు ఒత్తిడి చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ విషయాన్ని తమ ఛార్జ్ షీట్ లో పొందు పరిచారు.
దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టాలున్నాయి. పోక్సో చట్టం సెక్షన్ 14 ప్రకారం పిల్లల పోర్న్ షూట్ చేయడం నేరం. సెక్షన్ 15 ప్రకారం చైల్డ్ పోర్న్ వీడియోలను కలిగి ఉండటం నేరం. వీటిని షేర్ చేయడం తప్పు. ఐటీ యాక్ట్ 67 బీ ప్రకారం చైల్డ్ పోర్న్ చూడ్డం.. డౌన్లోడ్ చేసుకోవడం నేరం. ఇలా చేసిన వారి 5 ఏళ్ల వరకు జైలు, 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. 2015 లో టెంపరరీ పోర్న్ ను నిషేధించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది.
Also Read: అడ్మిషన్ కోసం వచ్చిన విద్యార్థి తల్లితో క్లాస్‌రూమ్‌లో హెడ్మాస్టర్ మసాజ్
కొడాలి నానిపై పోటీకి వంగవీటి రాధా సై.. స్నేహానికి ఎండ్ కార్డ్