Tamil Nadu: విరుదునగర్‌ ఘటనలో 19కి పెరిగిన మృతుల సంఖ్య.. ఇంకా విషమంగానే పలువురి పరిస్థితి

Firecracker Factory Fire: తమిళనాడులోని విరుదునగర్‌ ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య..

Tamil Nadu: విరుదునగర్‌ ఘటనలో 19కి పెరిగిన మృతుల సంఖ్య.. ఇంకా విషమంగానే పలువురి పరిస్థితి

Updated on: Feb 14, 2021 | 5:12 AM

Firecracker Factory Fire: తమిళనాడులోని విరుదునగర్‌ ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 19కి పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని అచ్చన్‌కుళం బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శుక్రవారం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 30మందికి పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి వరకు మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. చికిత్స పొందుతున్న 31 మందిలో 18 మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలనే గుర్తు పట్టినట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా కూలీ పనులు చేసుకుంటూ.. ఈ ప్రాంతంలోనే నివసిస్తారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read:

Arora Akanksha: ఐక్యరాజ్య సమితి చీఫ్ బరిలో భారత సంతతి మహిళ.. ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటున్న మన ‘ఆకాంక్ష’

Maharashtra: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే అంతే.. లాతూర్‌లో ఏడుగురు ఉద్యోగుల జీతంలో కోత.. ఎంతంటే..?