Crime News: తమిళనాడు అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఏనుగు మృతి.. దంతాలు మిస్సింగ్‌..

Crime News: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా అన్నమలై టైగర్ రిజర్వ్ పరిధిలోని ఓ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఏనుగు చనిపోయి కనిపించింది.

Crime News: తమిళనాడు అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఏనుగు మృతి.. దంతాలు మిస్సింగ్‌..
Elephant

Updated on: Aug 30, 2021 | 4:49 PM

Crime News: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా అన్నమలై టైగర్ రిజర్వ్ పరిధిలోని ఓ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఏనుగు చనిపోయి కనిపించింది. వెంటనే స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చనిపోయిన ఏనుగును పరిశీలించగా రెండు దంతాలు లేవు. దీంతో ఏనుగు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేటగాళ్లు దంతాల కోసం ఏనుగును చంపారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇందుకోసం అటవీ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వేటగాళ్లు దంతాల కోసం ఏనుగును చంపారా లేదా చనిపోయిన ఏనుగు నుంచి ఎవరైనా దంతాలను దొంగిలించారా అనే విషయం తేలాల్సి ఉందని అటవీ అధికారులు వివరించారు.

ఏనుగుల వేట
ఇదిలా ఉంటే.. ఉడుమల్ పేట్ డివిజన్ పరిధిలోని మావదప్పు గిరిజన సెటిల్మెంట్ సమీపంలో అటవీ శాఖ సిబ్బంది మరో ఏనుగు మృతదేహాన్ని గుర్తించారు. అది కుళ్లిపోయి ఉందని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. చాలా రోజుల కింద మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం ప్రకారం.. పోస్ట్ మార్టం తర్వాతే ఏనుగు మరణానికి కారణాన్ని నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో తరచూ ఏనుగులు మృతి చెందడం దంతాలు మాయం కావడం సంఘటనలు జరుగుతున్నాయి. ఇది స్మగ్లర్ల పనిగా అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా ఏనుగులను పొట్టనపెట్టుకున్నారు. మరోవైపు అనారోగ్యం కారణంగా కూడా కొన్ని ఏనుగులు చనిపోతున్నాయి.

Huzurabad By Election: నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..

Afghan New Ruler: అఫ్గానిస్తాన్ కొత్త రూలర్ అతనేనా? పబ్లిక్ అప్పియరెన్స్‌కు రెడీ అవుతున్నఅఖుంద్జాదా

Milk Crate Challenge: తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మరో ఆన్లైన్ గేమ్.. ఎందుకంటే..

Huzurabad By Election: ఏం చేద్దాం.. ఎవర్ని నిలబెడదాం.. హుజూరాబాద్‌ అభ్యర్థి ఎంపిక దగ్గరే ఆగిపోయిన కాంగ్రెస్ కుస్తీ