సైబర్ మిత్ర ఓ సూపర్ ఫ్రెండ్.. ఎలాగో తెల్సా..?
ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయాల వల్ల ఎన్నో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చదువుకునే అమ్మాయిల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే మహిళల దాకా ఎంతో మంది ఫేస్ బుక్‌కు అలవాటు పడి.. తెలియని వారితో ఛాటింగ్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి బయటపడింది. మాజీద్ అనే అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేసుకుని.. ఓ కేటుగాడు ఏకంగా 200 మంది విద్యార్థులను వేధింపులకు గురిచేశాడు. చదువుకుంటున్న అమ్మాయిలే టార్గెట్‌గా […]
ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయాల వల్ల ఎన్నో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చదువుకునే అమ్మాయిల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే మహిళల దాకా ఎంతో మంది ఫేస్ బుక్‌కు అలవాటు పడి.. తెలియని వారితో ఛాటింగ్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి బయటపడింది. మాజీద్ అనే అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేసుకుని.. ఓ కేటుగాడు ఏకంగా 200 మంది విద్యార్థులను వేధింపులకు గురిచేశాడు.
చదువుకుంటున్న అమ్మాయిలే టార్గెట్‌గా వారికి ఫ్రెండ్ రిక్వస్ట్‌లు పెడుతూ.. యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. వారిని నమ్మించి వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలుసుకుని వారిని వేధించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల క్రితం పదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయితో.. నీ సినియర్ అంటూ అదే స్కూల్లో చదువుకున్నాను అని చెప్పి ఫేస్ బుక్‌లో ఛాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మాయి వివరాలు తెలుసుకుని.. కొన్ని రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి చాటింగ్ చేయడం మానేసింది. ఇంకేముంది కోపంతో రగిలిపోయి.. “నీ ఫోటోలు అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో పెడతానంటూ” బెదిరింపులకు పాల్పడ్డాడు. చేసేదేమి లేక వాడు అడిగిన డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. కొన్నినెలల పాటు ఇలాగే మానసిక క్షోభను అనుభవించింది. తల్లిదండ్రులు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అమ్మాయిలు ఇలాంటి మోసాలకు బాధితులు కాకుండా.. త్వరలోనే సైబర్ మిత్ర కార్యక్రమాన్నిచేపట్టబోతున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇక పై ప్రతి శనివారం సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో 3 గంటల పాటు.. పాఠశాలలు, కాలేజీల్లోని విద్యార్థులకు సైబర్ వేధింపులు, నేరాలు అనే అంశం పై బోధించబోతున్నామని చెప్పారు.