Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ కేసులో కీలక విషయాలు వెల్లడించిన సైబరాబాద్‌ పోలీసులు..

|

Dec 28, 2021 | 12:18 PM

Sai Dharam Tej: సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ ఎంతటి సెన్సేషన్‌గా మారిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో తేజ్‌..

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ కేసులో కీలక విషయాలు వెల్లడించిన సైబరాబాద్‌ పోలీసులు..
Follow us on

Sai Dharam Tej: సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ ఎంతటి సెన్సేషన్‌గా మారిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో తేజ్‌ ప్రమాదానానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్‌తేజ్‌.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే తేజ్‌ యాక్సిడెంట్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్‌తేజ్‌పై ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయనున్నట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ తెలిపారు.

సోమవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో పాల్గొన్న కమిషనర్‌ స్టీఫెన్‌ రవింద్ర బైక్‌ యాక్సిడెంట్‌ విషయమై పలు కీలక విషయాలను వెల్లడించారు. సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ విషయమై కేసు నమోదు చేశామని తెలిపిన కమిషనర్‌.. ఆయన కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసుల్లో భాగంగా లైసెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌, ఆర్సీ, ఇన్సురెన్స్‌ వంటి డ్యాక్యుమెంట్లను సబ్‌మిట్ చేయాలని కోరామన్నారు. అయితే సాయ్‌ ధరమ్‌ తేజ్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలిపారు. తేజ్‌ నుంచి స్పందనరాని కారణంగా అతనిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. మరి దీనిపై తేజ్‌ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

Also Read: చిత్తూరు జిల్లాలో టీచర్ల అక్రమ డిప్యుటేషన్ వివాదం.. పెద్ద ఎత్తున చేతులు మారిన డబ్బు

ఆస్ట్రేలియాలో సరికొత్త జీవి !! 1306 కాళ్లు.. షాక్‌ గురి చేస్తున్న జీవి !! వీడియో

Fenugreek Leaves: మెంతి ఆకులతో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు సుమీ..