AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Websites: ఒక్క అక్షరం తేడా.. అంతే.. లక్షలు పోగొట్టుకుంటున్నారు..

అక్షరం తేడాతో నకిలీ వెబ్‎సైట్ క్రియేట్ చేసి జనాలను మోసం చేస్తున్నారు. నకిలీ నకిలీ వెబ్‎సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Fake Websites: ఒక్క అక్షరం తేడా.. అంతే.. లక్షలు పోగొట్టుకుంటున్నారు..
Cyber Crime
Srinivas Chekkilla
|

Updated on: Oct 05, 2021 | 9:36 PM

Share

అక్షరం తేడాతో నకిలీ వెబ్‎సైట్ క్రియేట్ చేసి జనాలను మోసం చేస్తున్నారు. నకిలీ నకిలీ వెబ్‎సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొందరు కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మాయ చేస్తున్నట్లుగా వివరిస్తున్నారు.

మల్లంపేట్‌కు చెందిన మహిళ తన కుటుంబ సభ్యులకు చెందిన పాస్‌పోర్టుల పునరుద్ధరణ కోసం ఆన్‌లైన్‎లో దరఖాస్తు చేశారు. బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.8485 డెబిట్ అయ్యాయి. ఎలాంటి రశీదు రాలేదు. స్లాట్‌ బుక్‌ అయినట్లు కూడా సమాచారం రాకపోవడంతో అనుమానమొచ్చి దుండిగల్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరా తీయగా అది నకిలీ ‘పాస్‌పోర్టు’ వెబ్‌సైట్‌ అని తేలింది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లు వందల్లో ఉన్నట్లు సైబరాబాద్‌, రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అసలు వెబ్‌సైట్ల మాదిరిగానే స్వల్ప మార్పులు చేసి నకిలీ వెబ్‌సైట్లను తయారు చేస్తున్నారు. అక్షారాన్ని మారుస్తూ వెబ్‌సైట్లను క్రియేట్ చేస్తున్నారు.  జాగ్రత్తగా గమనిస్తే తప్ప తేడా గుర్తించలేం. ఈ తరహా నకిలీ వెబ్‌సైట్లతో మొదట్లో నిరుద్యోగులకు టోకరా వేయడం మొదలు పెట్టారు. నౌకరీలైవ్‌.కామ్‌, నౌకరీఇండియా.కామ్‌, నౌకరీస్‌.కామ్‌, షైన్‌లైవ్‌.కామ్‌, షైన్‌ఇండియా.కామ్‌. పేరిట నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి.. ఆ లింక్‌ను నిరుద్యోగులకు పంపుతున్నారు. కొందరేమో బ్యాంక్‌ ఖాతా వివరాలిచ్చి.. అందులో ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతరత్రా ఛార్జీలను జమ చేయాలని సూచిస్తున్నారు. ఇంకొందరేమో రూ.11 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటున్నారు. అక్కడే పోర్టల్‌లోనే ఓటీపీ సాయంతో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు సార్లు లావాదేవీలు ఫెయిల్‌ అయినట్లు వస్తుంది. ఆ తర్వాత ఖాతాలో ఉన్న డబ్బంతా మాయమవుతుందని పోలీసులు చెబుతున్నారు.

ముఖ్యంగా పాస్‌పోర్టు సేవలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు సంబంధించి పదుల సంఖ్యలో నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీ, నోయిడా, గుడ్‌గావ్‌ తదితర ప్రాంతాల నుంచే ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. అక్కడ నేరగాళ్లు వివిధ పేర్లతో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. లోపలికెళ్లే వరకు కూడా అది కాల్‌ సెంటర్‌ అని ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ఒకటి, రెండు నెలలకోసారి అక్కడి నుంచి మకాం మారుస్తున్నారని పోలీసులు తెలిపారు.

Read Also.. Crime News: ఆహారంలో మత్తు మందు కలిపి.. ప్రియుడికి ఫోన్ చేసి.. దారుణానికి ఒడిగట్టిన భార్య..

Follow Us
వీటికి ఇకపై పాన్ కార్డు తప్పనిసరి.. కేంద్రం కొత్త రూల్స్
వీటికి ఇకపై పాన్ కార్డు తప్పనిసరి.. కేంద్రం కొత్త రూల్స్
పిల్లల చదువు కోసం.. ఇదే బెస్ట్‌ ప్లాన్‌!
పిల్లల చదువు కోసం.. ఇదే బెస్ట్‌ ప్లాన్‌!
Vastu Tips: గడియారం ఈ దిశలో ఉందా? ఆర్థిక సమస్యలు తప్పవు! సరైన దిశ
Vastu Tips: గడియారం ఈ దిశలో ఉందా? ఆర్థిక సమస్యలు తప్పవు! సరైన దిశ
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట