Cyber Crime: ముద్ర లోన్‌ అప్రూవ్‌ అయ్యింది అంటూ మెసేజ్‌ వచ్చిందా.? స్పందించారో మీ పని ఇక అంతే..

|

Nov 18, 2021 | 8:24 AM

Cyber Crime: సైబర్‌ నేరగాళ్లు రోజుకో పంథాను మార్చుకుంటున్నారు. ప్రజల అత్యాశను పెట్టుబడిగా పెట్టి రూ. లక్షలు కాజేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేపడుతోన్నా ప్రజలు మోసపోతూనే...

Cyber Crime: ముద్ర లోన్‌ అప్రూవ్‌ అయ్యింది అంటూ మెసేజ్‌ వచ్చిందా.? స్పందించారో మీ పని ఇక అంతే..
Cyber Crime
Follow us on

Cyber Crime: సైబర్‌ నేరగాళ్లు రోజుకో పంథాను మార్చుకుంటున్నారు. ప్రజల అత్యాశను పెట్టుబడిగా పెట్టి రూ. లక్షలు కాజేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేపడుతోన్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తికి చెందిన నాగులోల్ల రమేశ్‌, రాజు ఫోన్లకు ఓ మెసేజ్‌ వచ్చింది. ‘మీకు ముద్ర లోన్ మంజూరు అయ్యింది. పూర్తి వివరాలు పంపండి’ అన్నది ఆ మెసేజ్‌ సారాంశం. అసలు లోన్‌కు అప్లై చేశామన్న విషయాన్ని కూడా ఆలోచించని సదరు వ్యక్తులిద్దరూ అవతలి వారి మెసేజ్‌కు స్పందించారు.

లోన్‌ డబ్బులు రావాలంటే ఆధార్, బ్యాంకు ఖాతా, పాన్‌ కార్డు వివరాలు అడిగారు. దీంతో వెనకా ముందు ఆలోచించచని వారు పూర్తి వివరాలను పంపిచేశారు. దీంతో వారు పంపిన వివరాల ఆధారంగా మోసగాళ్లు లోన్‌కు సంబంధించి నకిలీ పత్రాలను సృస్టించారు. ఆ నకిలీ పత్రాన్ని వాట్సాప్‌ ద్వారా పంపించి.. లోన్‌ డబ్బు అకౌంట్‌లోకి రావాలంటే ముందుగా రూ. 3 వేలు చెల్లించాలని తెలిపారు. డబ్బులు పంపించిన తర్వాత కానీ తెలియలేదు తాము మోసపోయామని. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

ఇదిలా ఉంటే రెంజల్‌ మండలంలో మరికొంత మందికి కూడా ఇలాంటి ఫేక్‌ లెటర్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్పందించిన బ్యాంకు అధికారులు.. ‘ముద్ర’ లోన్స్‌ కావాలనుకునే వారు గవర్నమెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి దరఖాస్తు చేసుకోవాలని, వాట్సాప్‌ ద్వారా ఏ బ్యాంకులు లోన్‌కు సంబంధించి సమాచారం పంపించవని చెబుతున్నారు. ఇలాంటి మోసల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

IND vs NZ: ఇండియన్‌ ఓపెనర్ల తడాఖా.. ఖాతాలోకి సరికొత్త రికార్డ్‌.. ఏంటంటే..?